Posts

కాశీపురాధీశా!!!

Image
క్రితం సారి మనం కలుసుకున్నప్పుడు నిన్ను అడిగా కదా.. కానీ, నీ సన్నిధిలో 9 రోజులు గడపాలి అన్న సంకల్పాన్ని ఇంత త్వరగా నెరవేరుస్తావని అనుకోలేదయ్యా!! నేను ఎలా ఊహించుకున్నానో, అలాగే రోజులు గడిచిపోయాయి.  చెప్పలేని ఆనందం, అంతులేని తృప్తి ఇచ్చావు.  ఈ జన్మంతా నెమరువేసుకోడానికి సరిపడా తీపి జ్ఞాపకాలు పెట్టెలో సర్దుకుని తిరుగు ప్రయాణమయ్యామయ్యాం !!! రోజూ గంగలో స్నానం, నీ దివ్య దర్శనం, భోజనం, మళ్ళీ దర్శనం, వీలైతే ఇంకో దర్శనం - ఇలా గడిచిన పరమ పావనమైన రోజులవి.  ఎన్ని సార్లు తలుచుకున్నా తనివితీరడం లేదయ్యా, శివయ్యా... తొలిసారి నిన్ను స్పృశించిన అనుభూతి వర్ణనాతీతం.  మళ్ళీ మళ్ళీ నిన్ను తాకి పరవశించిన ఈ చేతులను ఎన్ని సార్లు ముచ్చటగా చూసుకున్నానో నీకు తెలుసుగా...  కేదార్ ఘాట్ లో ఒక మధుర  స్మృతి Places visited: 12th May - 22nd May విశ్వనాధుడు, అన్నపూర్ణమ్మ కాశీ విశాలాక్షి 18th May వారాహీ దేవి తిలభాండేశ్వరుడు కాలభైరవుడు బిర్లా టెంపుల్ సార్ నాధ్ సంకట మోచన్ హనుమాన్ దుర్గా మాత ఆలయం తులసీ మానస మందిరం త్రిదేవ్ ఆలయం గవ్వలమ్మ మందిరం చింతామణి గణపతి స...

వస్తున్నాం వస్తున్నాం.. లింగమయ్యా

Image
ఈ మాట పలుకుతూ జన సంద్రం నల్లమల అడవుల్లో దేవదేవుని దివ్యదర్శనానికై కదిలింది.  మండే ఎండలు కూడా లెక్కచెయ్యకుండా అడవంతా హరహర నామస్మరణతో పులకించింది. ఈ మహా యజ్ఞంలో మేముకూడా సమిధలు అవడం మహదభ్గాగ్యం కదూ... అసలు ఈ యాత్ర ప్రారంభమే ఒక అద్భుతం. చిలుకూరు బాలాజీ దర్శనంతో ప్రారంభించడం వల్ల సర్వం శుభప్రదమే కదా. సాయంత్రం వెళ్ళడంతో భక్తజనం తక్కువగా ఉండి చక్కటి దర్శనం ఎక్కువసేపు చేసుకున్నాం. స్వామి పక్కనున్న శ్రీదేవి భూదేవి కూడా కన్నులవిందుగా కనిపించారు. శ్రీరాముడు శ్రీశైలం ఉత్తర ద్వారంలో ఉన్న ఉమా మహేశ్వరుడిని దర్శించుకొని ఆ తరువాతే మల్లన్నని పూజించాడట.  అటువంటి స్వామికి అభిషేకం చేసుకొని సలేస్వరం బయలుదేరాం.  సలేశ్వరం అడవుల్లో వెలసిన లింగమయ్య ఏటా చైత్రపౌర్ణమికి మాత్రమే దర్శనమిస్తాడు. ఈ ఏడు మమ్మల్ని కూడా పిలిచాడు. పౌర్ణమి వెలుగులో 6 మైళ్ళు అడవిలో కొండలు ఎక్కీదిగీ ఆయనపై మాకున్న ప్రేమని చూపిస్తే, పరమ సంతోషంతో బదులుగా తన దివ్యదర్శనం ప్రసాదించాడు.  అక్కడ నుంచి శ్రీశైలం వెళ్ళే త్రోవలో బుగ్గ మల్లన్న దర్శనం ఇంకొక అనిర్వచనీయ అనుభూతి.  ఆ తరువాత మల్లికార్జునుని, భ్రమరాంబికా దేవిని...

మహేంద్రగిరిలో శివదర్శనం

Image
శివునికి మనమీద ప్రేమ ఎలాగూ ఉంటుంది.  తండ్రి తన బిడ్డలపై ప్రేమ చూపించడం చిత్రమేమీ కాదుగా.. మరి ఆ తండ్రిపై పిల్లలు కూడా తిరిగి ప్రేమ చూపిస్తే, మనకే కాదు, ఆ దేవదేవునికి కూడా అపరిమిత ఆనందమే.  ఇష్టపడితే 15km కొండల్లో ఎక్కిదిగి, విశ్వేశ్వరుని దర్శించుకు రావడం, అంత పెద్ద కష్టమేమీకాదు, అని ఇంకోసారి ఋజువయ్యింది. "నాకోసం ఇంత దూరం వచ్చారా నాయనలారా" అని శివుడు ఆనందించినట్లు అనిపించింది.  మాతోపాటు, మా అమ్మాయి కూడా హాయిగా అంత దూరం వచ్చేసింది.  పాండవులు అరణ్యవాసం చేసిన ప్రదేశంలో వెలిసిన శివాలయాలు అవి.  అనుభవించితే కానీ అందని అమితానందాన్ని గుండెలనిండా నింపుకొని తిరిగి వచ్చాం.   స్థల పురాణం చదువుకొని తరించండి. Temples visited: కొరసవాడ - సోమేశ్వరుడు - 9AM  పాతపట్నం - నీలమణి దుర్గ అమ్మవారు - 10AM పాతపట్నం - కేదారేశ్వరుడు మరియు నీలకంఠేశ్వరుడు - 10:30AM మహేంద్రగిరి - గోకర్నేశ్వరుడు (కుంతి నిర్మించిన ఆలయం) మరియు యుధిష్టరుడు ప్రతిష్టించిన ఆలయం - 5PM

మరో అద్భుత దర్శనం

Image
ఇంకోసారి శివకరుణతో అద్భుత శివదర్శనాలు జరిగాయి. యనమదుర్రు శివాలయం ఎంతో విశిష్టమైనది.  శివుడు శీర్షాసనంలో తపస్సు చేస్తూ ఉంటే అమ్మవారు  సుబ్రహ్మణ్యుని ఒళ్ళో పడుకోపెట్టుకుని ఉంటుంది.  అతి ప్రాచీన చరిత్రగల క్షేత్రమిది. ఇంకొక విశేషమైన ఉమా రామ లింగేశ్వర స్వామి ఆలయం, గొల్లప్రోలు దగ్గర  దుర్గాడ అనే ఊరిలో ఉంది. లింగం పైన ఒక రాయి ఉండటం విశేషం. ఇది పంచాయతన శివాలయం.  Temples visited: యనమదుర్రు - శక్తీశ్వర స్వామి - 10AM  భీమవరం - సోమేశ్వర స్వామి - 10:30AM పాలకొల్లు - క్షీరా రామ లింగేశ్వర స్వామి - 11:30AM అయినవిల్లి - సిద్ధి విఘ్నేశ్వర స్వామి - 1PM దుర్గాడ - ఉమా రామ లింగేశ్వర స్వామి - 4PM పిఠాపురం - కుక్కుటేశ్వర స్వామి, పురుహూతికా శక్తి పీఠం - 5PM

గిరిజమ్మ కరుణించింది

Image
ఎన్నాళ్ళకెన్నాళ్ళకు!! గత 6-7 నెలలుగా ఈ పిలుపు కోసం ఎదురు చూపు.  ఇన్నాళ్ళకు సాకారమైనదీ కల.  గిరిజాదేవి (బిరజాదేవి) దయతలిచింది, కన్నులపండుగగా అద్భుతమైన దర్శనంతో తనువు, మనసు పులకరించాయి. గుడి 1-3pm మూసివేస్తారంట.  అందుకని, 2-3 గంటలు కోవెల ఆవరణలోనే గడిపే అదృష్టం కూడా దక్కింది. శక్తిపీఠంలో అలా ఉండగలగడంకూడా వరమేకదా!!! ఆలయ ప్రాంగణంలో చాలా శివలింగాలు ఉన్నాయి.  10-15 సహస్రలింగాలు కూడా ఉన్నాయి.  చూసి తీరాల్సిన ఈ అద్భుతాన్ని మాటల్లో వర్ణించడం చాలా కష్టం సుమా !!! ఇంకొక విశేషమేమిటంటే, ఇది నాభిగయ క్షేత్రం.  గయ, జాజ్ పూర్, పిఠాపురం - ఈ మూడు క్షేత్రాలు కలిపి గయ క్షేత్రాలు. Places visited: నాభి గయ క్షేత్రం - జాజ్ పూర్ - 1:30PM గిరిజా దేవి శక్తి పీఠం - జాజ్ పూర్ - 3PM

లింగోద్భవ అద్భుతం

Image
శివునికి పరమ ప్రీతిపాత్రమైన శివరాత్రినాడు, శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో శివదర్శనం...  అనన్యసామాన్యమైన ఈ దివ్యానుభూతి నీ కరుణాకటాక్షమే కదా ఈశా. నీ సన్నిధానంలో శివరాత్రినాడు మెసిలానన్న ఆలోచన వస్తే చాలు, ఎంతో అద్భుతంగా ఉంది తెలుసా.  అమ్మ ఎదురుగా ఎంతసేపు నిల్చున్నానో నాకే తెలియదు.  జ్ఞాన ప్రసూనాంబ నన్ను గమనించే ఉంటుందిలే. ఈసారి నిన్ను వెతికే పనిలో దొరికిన మరొక అద్భుతం - గుడిమల్లం లో శ్రీ పరశురామేశ్వర స్వామి.  బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఏక శిలలో స్వయంభూ గా వెలిసిన అరుదైన, అతి ప్రాచీనమైన క్షేత్రాన్ని దర్శించే భాగ్యాన్ని ప్రసాదించావు.  వేంకటేశ్వర స్వామి తిరుగాడిన ప్రదేశాలు చూశాం.  ఆయనకు, పద్మావతి అమ్మవారికి వివాహమైన ప్రదేశాలకు, వెళ్ళగలిగామంటే మాటలా ?  వివాహంలో నలుగుపిండి విసిరిన తిరగలి చూశాం.  అంతా నీ లీలలే లే ఈశా !!! శివుని భక్తాగ్రణ్యునితో ఒక సెల్ఫీ... Temples Visited : శ్రీకాళహస్తి - శ్రీకాళహస్తీశ్వర స్వామి, జ్ఞాన ప్రసూనాంబ - 7th Mar 2PM and 8th Mar 4AM గుడిమల్లం - శ్రీ పరశురామేశ్వర...

పంచ శైవ క్షేత్రాలు

Image
మహావిష్ణు అవతారమైన బలరాముడు  ప్రజల నీటిబాధలు చూడలేక తన ఆయుధమైన  నాగలితో నాగావళిని సృష్టించాడు. అదే ప్రజల ఈతిబాధలు కూడా తీరాలిగా.  అందుకే, సర్వకాలములలో జనులు శివనామంకితులు అయ్యేలా దీన జనోద్ధరణకై ఆ నది ఒడ్డునందు ఐదు శైవక్షేత్రాలను ప్రతిష్టించాడు. అవి పంచ శైవ క్షేత్రాలు గా వాసికెక్కాయి. ఒకేరోజు ఆ పంచ శైవ క్షేత్రాలను దర్శించుకుంటే శివకృప వల్ల మోక్షం లభిస్తుంది. 20-02-2016 - శనిత్రయోదశి నాడు శివయ్య మాకు ఆ భాగాన్ని కలిగించాడు.  క్రింద చూపిన #1, #3, #6, #7, #8 కోవెలలు కలిపి పంచ శైవ క్షేత్రాలు. Temples visited: శ్రీ పాయకేశ్వర స్వామి -  తెరువలి, రాయగడ - 10AM మజ్జి గౌరమ్మ - రాయగడ - 10:30AM శ్రీ సోమేశ్వర స్వామి - గుంప, పార్వతీపురం - 1:30PM శ్రీ వేంకటేశ్వర స్వామి - తోటపల్లి, పార్వతీపురం - 2:30PM శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి - అడ్డాపుశిల, పార్వతీపురం - 3PM శ్రీ సంగమేశ్వర స్వామి - సంగం, రాజాం - 4PM శ్రీ మణి నాగేశ్వర స్వామి - కల్లేపల్లి, శ్రీకాకుళం - 7PM శ్రీ ఉమా రుద్ర కోటేశ్వర స్వామి - శ్రీకాకుళం - 8PM ...