సౌరాష్ట్రే సోమనాథంచ
పరమశివుని ద్వాదశ జ్యోతిర్లింగాలలో ప్రథమస్థానంలో వున్న సోమనాథక్షేత్రం గుజరాత్‌లో వుంది. లయకారకుడు జ్యోతిర్లింగ ఆకారంలో భక్తులకు యుగయుగాల నుంచి దర్శనమిస్తూ అభయమిస్తున్నారు. అనేక దండయాత్రలకు గురైనప్పటికీ తిరిగి పునర్ నిర్మితమైన క్షేత్రమది. సిరిసంపదలతో వున్న ఈ క్షేత్రంపైకి అనేక మంది విదేశీపాలకులు దండయాత్రలు చేశారు. చంద్రునికి శాపవిముక్తి జరిగిన క్షేత్రం కాబట్టే సోమనాథక్షేత్రంగా పేరొందింది. చంద్రునికి శాపవిముక్తి కలిగించిన శివుడు దక్షప్రజాపతి తన 27 కుమార్తెలను చంద్రునికిచ్చి వివాహం చేశాడు. అయితే చంద్రుడు రోహిణితో మాత్రమే సఖ్యంగా వున్నాడని మిగిలిన భార్యలు తమ తండ్రైన దక్షప్రజాపతికి ఫిర్యాదుచేశారు. దీంతో ఆగ్రహం చెందిన ఆయన చంద్రుడు క్షయవ్యాధితో బాధపడాలని శాపమిచ్చాడు. దీంతో భూలోకంపై వచ్చిన చంద్రుడు ప్రస్తుత క్షేత్రమున్న ప్రాంతంలో శివ విగ్రహాన్ని ప్రతిష్టించి తపస్సు చేశాడు. తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు ప్రత్యక్షమై శాపం నుంచి విముక్తి కలిగించాడు. 27 సతీమణులను సరిసమానంగా చూసుకోవాలని చంద్రునికి హితవు పలికాడు. చంద్రునికి శాపవిముక్తి జరిగిన ప్రదేశం కాబట్టి సోమనాథక్షేత్రంగా పేరొచ్చింది. ఆదిలో ...