Posts

Showing posts from December, 2017

సౌరాష్ట్రే సోమనాథంచ

పరమశివుని ద్వాదశ జ్యోతిర్లింగాలలో ప్రథమస్థానంలో వున్న సోమనాథక్షేత్రం గుజరాత్‌లో వుంది. లయకారకుడు జ్యోతిర్లింగ ఆకారంలో భక్తులకు యుగయుగాల నుంచి దర్శనమిస్తూ అభయమిస్తున్నారు. అనేక దండయాత్రలకు గురైనప్పటికీ తిరిగి పునర్‌ నిర్మితమైన క్షేత్రమది. సిరిసంపదలతో వున్న ఈ క్షేత్రంపైకి అనేక మంది విదేశీపాలకులు దండయాత్రలు చేశారు. చంద్రునికి శాపవిముక్తి జరిగిన క్షేత్రం కాబట్టే సోమనాథక్షేత్రంగా పేరొందింది. చంద్రునికి శాపవిముక్తి కలిగించిన శివుడు దక్షప్రజాపతి తన 27 కుమార్తెలను చంద్రునికిచ్చి వివాహం చేశాడు. అయితే చంద్రుడు రోహిణితో మాత్రమే సఖ్యంగా వున్నాడని మిగిలిన భార్యలు తమ తండ్రైన దక్షప్రజాపతికి ఫిర్యాదుచేశారు. దీంతో ఆగ్రహం చెందిన ఆయన చంద్రుడు క్షయవ్యాధితో బాధపడాలని శాపమిచ్చాడు. దీంతో భూలోకంపై వచ్చిన చంద్రుడు ప్రస్తుత క్షేత్రమున్న ప్రాంతంలో శివ విగ్రహాన్ని ప్రతిష్టించి తపస్సు చేశాడు. తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు ప్రత్యక్షమై శాపం నుంచి విముక్తి కలిగించాడు. 27 సతీమణులను సరిసమానంగా చూసుకోవాలని చంద్రునికి హితవు పలికాడు. చంద్రునికి శాపవిముక్తి జరిగిన ప్రదేశం కాబట్టి సోమనాథక్షేత్రంగా పేరొచ్చింది. ఆదిలో ...

నాలుగు యుగాలు

వేదాల ననుసరించి యుగాలు నాలుగు : అవి : 1) సత్యయుగము 2) త్రేతాయుగము  3) ద్వాపరయుగము 4) కలియుగము. 1) సత్యయుగము : నాలుగు యుగాలలో సత్య యుగము మొదటిది. ఈ సత్యయుగానికే కృతయుగమని పేరు. ఈ యుగమునందు భగవంతుడు నారాయణుడు, లక్ష్మీ సహితముగా భూమిని పరిపాలిస్తాడు. దీని కాల పరిమాణము 432000 * 4 = 1728000 అనగా పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరములు. ఈ యుగంలో ధర్మం నాలుగుపాదాల మీద నడుస్తుంది. ప్రజలు ఎలాంటి ఈతిబాధలు లేకుండా సుఖసంతోషాలతో ఉంటారు. అకాలమరణాలుండవు. ఈ యుగము వైవశ్వత మన్వంతరములో సత్యయుగము కార్తీక శుద్ధ నవమి రోజు ప్రారంభమయినది. 2)  # త్రేతాయుగము  :- రెండవ యుగ ము  త్రేతా యుగము. ఈ యుగములో భగవంతుడు శ్రీ రామ చంద్రుడుగా అవతరించి రావణాసురుణ్ణి సంహరించి ధర్మ సంస్థాపన చేసాడు. ఈ యుగము పరిమితి 4,32,000 * 3 = 12,96,000 అనగా పన్నెండు లక్షల తొంభైఆరు వేల సంవత్సరములు. ఇందు ధర్మము మూడు పాదములపై నడుస్తుంది. ఈ యుగము వైశాఖ శుద్ధ తదియ రోజునుండి త్రేతాయుగము ప్రారంభమైనది. 3)  # ద్వాపరయుగము  :- మూడవు యుగమే ద్వాపర యుగము అని అంటారు, ఈ యుగమున భగవంతుడు శ్రీ కృష్ణుడుగా అవతరించారు. ద...

అంతర్వేది

అంతర్వేది లక్ష్మీనృసింహస్వామి స్థలపురాణం :- కృత యుగము లోని మాట ఒకసారి నైమిశారణ్యంలో శౌనకాది మహర్షులు సత్రయాగం చేస్తున్న సమయంలో సూత మహాముని ద్వారా పుణ్యక్షేత్రాల గురించి తెలుసుకొనుచూ ఒకరోజు అంతర్వేది గురించి సూత మహామునిని అడుగగా ఆ మహాముని అంతర్వేది నిగురించి బ్రహ్మ, నారదుల మధ్యజరిగిన సంవాదాన్ని శౌనకాది మహర్షులకు చెప్పుతాడు. క్షేత్ర నామం :- బ్రహ్మ రుద్రయాగము చేసిన ప్రదేశము (కమలము) ఒకప్పుడు శివుని పట్ల చేసిన అపచారాలకు ప్రాయశ్చిత్తంగా బ్రహ్మ రుద్రయాగం చేయాలని నిశ్చయించి, యాగానికి వేదికగా ఈ ప్రదేశాన్ని ఎన్నుకొంటాడు. వేదికగా ఎన్నుకోబడిన కారణంగా ఈ ప్రదేశానికి అంతర్వేది (అంతర్, వేదిక) అనే పేరు వచ్చింది అని చెబుతారు. వశిష్ఠుడు ఇక్కడ యాగము చేసినందు మూలముగా ఇది అంతర్వేదిగా ప్రసిద్ధి గాంచింది. రక్తవలోచనుని కథ :- ఒకానొక సమయంలో రక్తావలోచనుడు (హిరణ్యాక్షుని కుమారుడు) అనే రాక్షసుడు వశిష్ఠ గోదావరి నది ఒడ్డున వేలాది సంవత్సరాలు తపస్సు చేసి, శివుని నుంచి ఒక వరాన్ని పొందుతాడు. ఆ వరం ప్రకారం, రక్తావలోచనుని శరీరం నుండి పడిన రక్తం ఎన్ని ఇసుక రేణువుల మీద పడుతుందో అన్ని ఇసుక రేణువుల నుండి తనంత పరాక్రమవ...

అంతర్వీక్షణం

ఈశ్వరుడు స్మశానం లో ఎందుకు ఉంటాడో తెలుసా ?  నా అన్నవాళ్ళు అందరూ వదిలేసిపోతే, నీకు నేనున్నానంటూ తన చెంతకు చేర్చుకోడానికే.. నా తండ్రి అక్కడున్నాడు... కావలసింది అంతర్వీక్షణం.. గమ్యం బయట లేదు... లో లోపల ఉంది... నా కర్మలు..!   కసిదీర్చుకుంటున్నాయిలా ...!!   నాకు  నిన్ను...  అప్పుడప్పుడు...  దూరం చేస్తూ...!!?  మహేశా... శరణు  శరణు

శ్రీశైల మహాక్షేత్రం

# శ్రీశైల  _చరిత్ర శ్రీశైల మహాక్షేత్రం ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా, ఆత్మకూరు తాలుకా లోనున్న నల్లమల అడవులలోని పర్వత శ్రేణుల నడుమ పాతాళగంగ పేరుతో ఉత్తర వాహినిగా ప్రవహిస్తున్న కృష్ణా నదికి కుడివైపున ఉంది. ఈ క్షేత్రం సముద్రమట్టానికి 476 మీటర్లు సుమారుగా 1500 అడుగులు . # శ్రీశైల_మహిమ   12 జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీ మల్లికార్జున స్వామి కి పద్దెనిమిది శక్తి పీఠాలలో ఒకరైన శ్రీ భ్రమరాంబికాదేవికి, నిలయమైన ఈ మహాక్షేత్రం వేదములకు ఆలవాలమై, సకల సంపదలకు పుట్టినిల్లై , 8 శృంగాంగాలతో, 44  నదులతో దీర్ఘ తీర్థరాజాలతో, పరాశర, భరద్వాజాది మహర్షుల తపోవనాలతో, చంద్ర గుండ, సూర్య గండాది పుష్కరిణులతో స్పర్శవేదులయిన లతలు, చెట్లు మరియు లింగాలతో అనంతమైన ఔషధులతో విరాజిల్లుతూ యాత్రికుల మనసులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. # క్షేత్ర_ప్రాముఖ్యం . సకల లోకారాధ్యం అయిన శ్రీశైల మహాక్షేత్రం, భూమండలానికి నాభిస్థానమని పురాణాలు చెబుతున్నాయి. ప్రపంచంలోని ఏ ప్రాంతంలో ఏ పూజ చేసినా, ఏ వ్రతం ఆచరించినా సంకల్పంలో శ్రీశైలాన్ని స్మరిస్తూ _ శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే, శ్రీశైల ఉత్తదిగ్భాగే అని, తాము శ్రీశైల క్షేత్రానికి ఏ ...

రుద్ర నమకచమకములు - భావము - part3

ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం ఉర్వారుకమివ బంధనాన్మృత్యోర్మృక్షీయమామృతాత్  యో రుద్రో అగ్నౌ యో అప్సుయ ఓషధీషు యో రుద్రో విశ్వా భువనా వివేశ తస్మై రుద్రాయ నమో అస్తు. కాల స్వరూపుఁడు, అఖండ ఆనంద స్వరూపుఁడు ఐన ఆ పరమాత్మతో యోగము ద్వారా మన దేహము పవిత్రమగును గాక.పండిన దోస పండు తనంతట తానే తొడిమ నుండి వేరు పడినట్లు మనమూ మృత్యువు నుండి వేరు పడి అమృతత్వమును పొందుదుము గాక. అగ్ని, నీరు మున్నగు వానియందును, ఓషధులు విశ్వమున భువనములందును ఏ రుద్రుఁడు లీనమై యుండెనో అట్టి రుద్రునకు నమస్కారము అగును గాక. " తముష్టుహి యస్స్విషుసు  ధన్వాయో విశ్వస్య క్షయతి భేషజస్య యక్ష్వా మహే సౌ మనసాయ రుద్రం న మో భిర్దేవ మసురందువస్వ. ఉత్తమమైన అస్త్ర శస్త్రములు కలిగి, వైద్యుడై మన రోగాలను నిర్మూలించే,రాక్షసులను సంహరించే రుద్రునికి మన మనస్సులను పవిత్రం చేస్తున్నందుకు నమస్కారములు. అయంమే హస్తో భగవానయంమే భగవత్తర: అయంమే విశ్వభేషజోయం శివాభిమ ర్శన:  శివుని తాకి, పూజించే ఈ హస్తము మాకు దేవునితో సమానము. శివుని తాకినఈ హస్తము నా సర్వ రోగములకు దివ్యౌషధము. యేతే సహస్ర మయుతం పాశా మృత్యోమర్త్యాయ  హంతవే  తా...

రుద్ర నమకచమకములు - భావము - part2

అనువాకము 5. యజుస్సు 1. నమో భవాయచ రుద్రాయచ. ప్రాణుల యుత్పత్తికి మూల కారణమైన, జీవుల రోదనమునకు కారణ మైనట్టియు దుఃఖమును ద్రవింప జేయు నట్టి శివునకు నమస్కారము. యజుస్సు 2. నమశ్శర్వాయచ పశుపతయేచ. పాప నాశకులకును, అజ్ఞానులైన పురుషులను పాలించు వారికిని నమస్కారము. యజుస్సు 3. నమో నీలగ్రీవాయచ శితి కంఠాయచ. నీలగ్రీవము స్వేత కంఠము కలవాఁడు నగు శివునకు నమస్కారము. యజుస్సు 4. నమః కపర్దినేచ వ్యుప్త కేశాయచ. జటాజూటము కల వానికి, వ్యుప్త ముండిత కేశునకు (జుత్తులేనివానుకు) నమస్కారము. యజుస్సు 5. నమస్సహస్రాక్షాయచ శతధన్వనేచ. ఇంద్ర వేషముచే సహస్రాక్షుఁడైన వాఁడును, సహస్ర భుజములు గల అవతారములు ధరించుటచే శతధన్వుఁడును ఐన శివునకు నమస్కారము. యజుస్సు 6. నమో గిరిశాయచ శిపివిష్టాయచ. కైలాసమున ఉండువాఁడును, శయనించువాఁడును, విష్ణువును తన హృదయమున ధరించువాఁడును అగు శివునకు నమస్కారము. యజుస్సు 7. నమో మీఢుష్టమాయచేషుమతేచ. మేఘ రూపమున మిక్కిలి వర్షము కురిపించువాఁడును, బాణములు కలవాఁడును అగు శివునకు నమస్కారము. యజుస్సు 8. నమో హ్రస్వాయచ వామనాయచ. (అల్ప ప్రమాణుడగుటచే) హ్రస్వముగా నున్నట్టియును, (వ్రేళ్ళు మున్నగు అవయవముల సం...

రుద్ర నమకచమకములు - భావము - part1

Image
రుద్రము - నమకము అనువాకము 1. 1వ మంత్రము. నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః. నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముత తేనమః. ఓ రుద్రుఁడా! నీ కోపమునకు నమస్కారము. నీ కోపము నా బాహ్యాంతశ్శత్రువులపైన ప్రవర్తించును గాక. (నన్ను బాహ్యాంతశ్సత్రుహీనునిగా చేయుదువు గాక అని భావము) అంతే కాదు. నీ బాణమునకు, ధనుస్సునకు ధనుర్బాణ సహితములైన నీ బాహువులకు ఇదే నా నమస్కారము. 2వ మంత్రము. యాత ఇషుశ్శివతమా శివం బభూవ తే ధనుః. శివాశరవ్యా యాతవతయానో రుద్ర మృడయ. ఓ రుద్రుఁడా! నీ యీ శరము చాలా శాంతమైనదాయెను. నీ ధనుస్సు శాంతమైనదాయెను. నీ యమ్ములపొది శాంతమైనదాయెను. కావున శాంతించిన శరీరము తోడను, అమ్ములపొది తోడను మమ్ములను సుఖపరచుము. 3వ మంత్రము. యాతే రుద్ర శివా తనూర ఘోరాపాపకాశినీ. తయాన స్తనువా శంతమయా గిరిశంతాభిచా కశీహి. ఓ రుద్రుఁడా! మమ్ములను అనుగ్రహించు నీ శివ యను శరీరము మా పట్ల అఘోరమై యుండును గాక. ఆ నీశరీరము మా పట్ల హింసారూపమైన అనిష్టమును ప్రకాశింప జేయకుండును గాక.(ఇట పాపమనగా హింసా రూపమగు అనిష్టము) ఓ పరమ శివా నీ శరీరము మమ్ములను స్వయముగా హింసింప కుండుటయే కాదు. పరుల వలన యే అనిష్టము కలుగ నీయక కాపాడ వలయును. మమ్ములనెవరును హ...