Posts

కాశీకి పోయాను రామా హరీ !!!

Image
కాశీకి పోయాను రామా హరీ !!! గంగలో.. మునిగాను ముమ్మారు రామా హరీ !!! కాశీకి పోయాను రామా హరీ !!! శివుని కళ్ళార చూసాను రామా హరీ !!! నువ్వు కరుణిస్తే, ఇలాగే ఉంటుంది.  అంతా శివ మయంగానే అగుపిస్తుంది, శివదర్శనంతో కళ్ళు తరించిపోతాయి, శివ స్పర్శతో చేతులు పరవశించిపోతాయి. శివనామస్మరణతో మనసు ఉప్పొంగిపోతుంది . ఆరంభమే అద్భుతం, భువనేశ్వర్ లో ఆహా అనిపించే నీ అందమైన స్వరూపం, లింగరాజ్ రూపంలో ప్రత్యక్షం. హరిహరులు ఒకే పంచన కలిసి కనిపించి కనులవిందు చేసారు. గంగమ్మ మనిషికే కాదు, మనసుకున్న మలినాలని కూడా కడిగెస్తుందిగా!!! అలా మమ్ము పరమ పునీతులని చేసింది, నీ సన్నిధికి రాగానే. ముమ్మారు హరనామస్మరణ చేస్తూ మునిగిన మూడు మునకలతో మూడు జన్మల పాపం హరించుకుపోయి, మూడింతల శక్తి వచ్చింది. నా చిరకాల వాంఛని ఇన్నాళ్ళకి ఈడేర్చావా హరా!!! నీ సన్నిధిలో ఎంతసేపు ఉన్నా తనివితీరదు కదా!!! ఏమిటి నీ ఈ మాయ, మహేశా!!! మళ్ళీ మళ్ళీ ఎన్నెెన్ని సార్లు కాశీపురం తీసుకువచ్చి నా తనివి తీరుస్తావో చూస్తా, యెదురు చూస్తా !!! నీ దివ్యమంగళ దర్శన భాగ్యంతో పాటు, అమ్మని చూశాము, అన్నపూర్ణమ్మ పెట్టిన అన్నం తిన్నాము. విశాలాక్షి అ...

శివా!!! నీ ఇంటికొచ్చా!!!

Image
చూసావా, శివా !!! నిన్ను బతిమాలి, విసిగించి, ఒప్పించి, నీ వెండిఇంటికి చేరుకున్నా!!! నీ కైలాసావాసం చూసినందుకు నాకు ఆనందం, నీకు నా నస నుంచి చిన్న విరామం... నమ్మినందుకు ఉన్నానని నాకు ఈ అదృష్టం కలిగించావని నమ్ముతున్నాలేవయ్యా, శంకరా !!! శివాజ్ఞ అయ్యాకా, ఇక తిరుగేముంది... భువనాలనేలే రాజువి, నీ దయతో నీ ఇంటికి రావటం, పూర్వ జన్మ సుకృతమే... నీ ఇల్లే కదా, ఇక్కడెక్కడైనా కనిపిస్తావేమో అని నా కళ్ళు నిన్ను వెతకడం, నీకు తెలుస్తోందిగా... మరి కనబడి కరుణించరాదా, కైలాసవాసా... సరేలే, కనబడేదాకా నిన్ను నే వదలను, కనబడినాకా నీ తోనే నేను... ఒక్క కోరిక తీర్చు, కడ దాకా నీ ఆలోచనలు, కడతేరాకా నీ చరణాలు... వదలకుండా నన్ను నీ వెంట ఉండేలా ఓకంట కనిపెట్టు, కారుణ్యమూర్తీ... Daily highlights of the trip are captured here . Places visited: మానస సరోవరం, టిబెట్ - 2nd Sep 2PM కైలాస పర్వతం, టిబెట్ - 3rd Sep 10AM (parikrama start) పశుపతినాథ్, ఖాట్మండు - 7th Sep 10AM జల్ నారాయణ్, ఖాట్మండు - 7th Sep 3PM

శ్రీశైల మల్లన్న - లొద్ది మల్లయ్య

Image
శివుని ఆనతి లేకుండా ఆయన దర్శనం లభించదు అని అంటారు... మరి శివుడు సరే అంటే, ఇక ఆనందమే కదా... ఇంతకు ముందు చాలా సార్లు ప్రయత్నించినా, శ్రీశైలం వెళ్ళడం కుదరలేదు .. కానీ, ఇప్పుడు దగ్గరుండి అంతా ఆయనే చూసుకొని రప్పించుకున్నాడు అంటే నమ్మక తప్పదు సుమా... శ్రీశైలం లో అభిషేకం ఆనందమయం... శివ స్పర్శ యొక్క అనుభూతి  ఇంకా నా చేతులను వీడలేదు... మహేశ్వరుని వీభూది రేఖలు ఇంకా నా నొసటన ఉన్నట్టే ఉంది... దక్కింది, ఆయన దయ వల్ల ఇన్నాళ్టికి ఆ దివ్యదర్శనం దొరికింది... హర హరా అంటూ చెంబుడు నీళ్ళు శివుని మీద పోసిన ఈ నా చేతుల అదృష్టం ఏమని వర్ణించను? లొద్ది మల్లయ్య ఆలయం ప్రతీ ఏడూ తొలి ఏకాదశి నాడు మాత్రమే తెరుస్తారట.  కొండల్లో వెలసిన ఆ దేవదేవుని చూడాలంటే, 4km పాటు కొండలు ఎక్కి దిగి కష్టపడాలి, ఇష్టపడాలి... 60+ ఏళ్ళ వయసులో కూడా, మా అమ్మ రాగలిగింది అంటే, 8 ఏళ్ళ లోపు పిల్లలు ఇద్దరూ సునాయాసంగా ఎక్కేసారంటే, శంకరుని మాయ కాక ఇంకేంటి? A selfie while on the drive Temples visited: ఉమామహేశ్వరం - ఉమామహేశ్వరుడు - 25th July 5PM శ్రీశైలం - మల్లికార్జున స్వామి , భ్రమరాంబ...

గోదారి పుష్కర స్నానం

Image
144 సంవత్సరాల తరువాత వచ్చిన అరుదైన పుష్కరాలంట... గోదారమ్మ లో మునకేసినంతనే పుణ్యమందించే అరుదైన పవిత్ర తిథులంట... శివయ్యని తలుచుకుంటూ మూడు మునకలేస్తే ముక్కంటి కరుణిస్తాడంట... పిప్పలాదాత్ సముత్పన్నే కృత్యే లోక భయంకరీ మృత్యకాంత మయాదత్తం ఆహారార్ధం ప్రకల్పయా అంటూ చిటికెడు మట్టి గట్టు నుండి తీసి, నది లోకి వేసి సకుటుంబంగా స్నానమాచరించి రావాలంట... 21-07-2015 వ తేదీ మాకు ఈ భాగ్యాన్ని ప్రసాదించింది. రాజమండ్రి లో విశ్వేశ్వర ఘాట్ లో శివ కృప వల్ల అంతా సాఫీ గా జరిగింది. అదే రోజు రాత్రి తిరిగి ఇంటికి చేరుకున్నాము.

కేదార్ నాధ్

Image
శివుని కరుణ వల్ల ఇంతవరకూ వచ్చి ఆయనని చూడగలిగాము. హిమాలయాలు -  ఆయన నడయాడే ప్రదేశం. కేదార్ నాధ్ - ఆయన వెలిసిన ప్రదేశం. ఇక్కడకి వచ్చేలా ఆశీర్వదించావా, దేవ దేవా!!! దేవ భూమి లో నడిచే అదృష్టం  నాకు ఇచ్చావా, కరుణా మూర్తీ !!! నయనాలకి ఎంత పండగ  కదా... ఈ జన్మలో మరిచిపోలేని అనుభూతి ఇచ్చిన నీకు ఏమి ఇచ్చి ఋణం తీర్చుకోగలను?  నా మనసు తప్ప.. అయినా, నా వెర్రి గానీ, అంతా నీదే కదా, నీకు నేను ఇచ్చేది ఏముంది రా, శంకరా !!!  చూసిన ప్రదేశాలు: 1.  కేదార్ నాథ్ - 31st May 9AM 2.  త్రిభువన్ నారాయణ్  - 31st May 1PM  3.  గౌరీ కుండ్ - 31st May 4PM  4.  ముండ్ కటియ గణేష్ - 31st May 5PM 5.  గుప్త కాశి - 1st జూన్ 8AM  6.  తపకేశ్వర్ (డెహ్రాడున్ ) - 1st జూన్ 5PM 7.  హరిద్వార్ గంగ - 1st జూన్ 8PM

చాగంటి వారిని చూశానోచ్ !!!

నిజం !!! ఇది నిజంగా నిజం...  కొమ్మాది లో ఉన్న అష్టలక్ష్మి ఆలయానికి వెళ్ళినప్పుడు ఈ  అద్భుతం జరిగింది... సోమవారం కదా,  మంగళ గౌరీ సమేత శ్రీ వైశాఖేశ్వర స్వామి  దర్శనం కోసం అని వెళ్లి, హారతి తీసుకొని తిరిగివస్తూ ఉంటే, మా అమ్మాయి, "నాన్నా... చూసావా, చాగంటి కోటేశ్వరరావు గారు..." అని చెప్పింది.  దగ్గరకి వెళ్లి  చూస్తే, నిజమే... స్వామి దర్శనం తో పాటు, గురువు గారి దర్శనం కూడా అయ్యింది.  "అయ్యా!!! నమస్కారం" అని చెప్పాను.. ప్రతి నమస్కారం చేసుకుంటూ చాగంటి వారు పత్నీ సమేతం గా పక్క గుడి లోకి వెళ్ళిపోయారు ... ఎంతో సంతృప్తి తో మేము ఇంటికి తిరిగి వచ్చాము. 

Amarkantak trip

Image
We went to Amarkantak over weekend  and brought back unforgettable memories with us. It is both devotional and emotional trip. We started on 15th May from Vizag and Reached Raipur on 16th morning.  We took a taxi and travelled for next two days. After taking a long ride, we thoroughly enjoyed the " Achanakmar safari " ride along with kids.  And then went to one of the most sacred places on the earth where Narmada river was born, Amarkantak.  Lord Siva on the name of Amareswar and Narmada mayi are worshipped there.  We had a nice stay at MP tourism hotel there. 17th early morning, we went to Kapildhara and Doodh dhara water falls.  This is that awesome place where Kapila muni and Durvasa muni stayed once upon a time.  From there, we went to Jwaleswar temple which is also near by Amarkantak. Then, we had another long ride to Bhoramdeo  temple.  Another ancient temple of lord Siva !!! We had a ride back to Raipur and enjoyed Domino...