Posts

చిదంబరం - శ్రీరంగం

Image
సెలవులు దొరికితే చాలు, ఏ ఆలయాలకు వెళ్లి దర్శనాలు చేసుకుందామా అని ఆలోచన ఉంటే బావుంటుంది కదూ.  మన ఆలోచనలు అలా ఉంటే, ఆయన కూడా అటువైపు నడిపిస్తాడు సుమా.   ముందుగా, అరుణాచలం వెళ్లి, అగ్ని లింగాన్ని దర్శించుకున్నాం.  నెలరోజుల్లోన్నే, రెండోసారి దర్శనం ఇచ్చిన స్వామికి కృతఙ్ఞతలు చెప్పుకొని, అక్కడి నుంచి  వృద్ధాచలం  వెళ్లాం.  ఎంతో పురాతనమైన, అందమైన ఆలయం... ఆయనముందు చాలా సమయం గడపగలిగాం.  సుందర నాయనారు ని 12000 బంగారు నాణాలతో శివయ్య అనుగ్రహించిన దివ్య సుక్షేత్రం.  తనివితీరా స్వామిని కళ్లారా చూసుకొని, అక్కడినుంచి శ్రీముష్ణం వెళ్లాం.  అష్ట స్వయం వ్యక్త క్షేత్రాలలో ఒకటి అయిన ఈ అద్భుత ఆలయం చూడటానికి రెండు కళ్ళూ చాలవు.  స్వామి ఎంత చక్కగా ఉన్నారో... చాలాసేపు ఆయననే చూస్తూ ఉండిపోయేసరికి, ఆలయం మూసే సమయం అయిపోయింది.  అక్కడినుంచి చిదంబరం వెళ్లి అక్కడ రాత్రి బస. మరునాడు, చిదంబరం నటరాజ స్వామి, శివకామసుందరి.. ఇద్దరూ ఇద్దరే. గంటకి పైగా ఆలయంలో గడిపినా, తనివితీరలేదు.  పంచభూత శివాలయాల్లో, ఆకాశలిం...

అహోబిలం & మహానంది

Image
ఎంతటి ప్రేమ. .. అంతటా ఉన్నావని అంతా అంటున్నా, అంతులేని ప్రపంచమంతా నిన్నుగూర్చి వెతికే మా అజ్ఞానానికి నవ్వుకోక, 'వెర్రివాళ్ళు నాకోసమేకదా వెతుకుతున్నార'ని నీ అద్భుత దర్శనాలను ప్రసాదించేంత  ప్రేమ.  ఎంతటి దయ... ధ్యాన దానాది సత్కర్మలను సరిగా ఆచరించక, నీ దర్శనం మాత్రమే పుణ్యమనుకొనే  మాబోటి వాళ్ళ మూఢత్వానికి కోపించక, 'ఎప్పటికైనా తెలుసుకొంటారులే' అని జాలితో దీవించేంత దయ.  ఎంతటి కరుణ...  నీకోసం వచ్చే చిన్ని ఆలోచనని ధ్యాసగా,  ధ్యాసని ఇష్టంగా,  ఇష్టాన్ని భక్తిగా, భక్తిని ప్రేమగా...  నీవే భావించుకొని 'నీకేంకావాలో తీసుకోరా' అని కరుణించేంత కరుణ. ఉత్తరద్వార దర్శనంతో ప్రారంభమైన  వైకుంఠ ఏకాదశి,   ఆద్యంతం అద్భుతంగా సాగింది.   నవ నా రసింహులలో ఎనిమిది ఆలయాలని ఈ రోజు చూసాం.  ఒక్కో ఆలయం, ఒకటికి మించి ఒకటి... ఒక్కో దర్శనం, ఒకటితో  సరిపోలినది ఒకటి...  ఒక్కో విగ్రహం,  ఒకటి కాదు, సహస్ర విగ్రహాలకు సమానం.  శివ కేశవులకు అభేదం కదూ.. అందుకే, నరసింహస్వామిని 'నా మదిలో శివుడిని నిలపమని' అడిగా.  మహాలక్ష్మి ద...

అరుణాచల శివ

Image
అరుణగిరి ప్రదక్షిణం - ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న అదృష్టం ఇన్నాళ్ళకి మమ్మల్ని వరించింది.  అపీతకుచాంబ అమ్మవారు, అరుణాచలేశ్వరుడు కలిసి ఆశీర్వదిస్తే, తీరని కోరిక ఏముంటుంది ? 14 కిలోమీటర్లు, 11 శివాలయాలు, చక్కని సాయంత్రం నడక - ఇలా అందంగా సాగింది, అరుణగిరి పరిక్రమ.  అష్ట దిక్కులా, అష్ట దిక్పాలకులు ప్రతిష్టించిన అష్ట శివాలయాలు ,  వాటితోపాటు, సూర్య లింగం, చంద్ర లింగం, ఇంకా ఆది అన్నామలై ఆలయం.  అన్నీ దర్శించుకొని, ప్రశాంతంగా తిరిగి రావడానికి సుమారుగా 5 గంటలు పట్టింది. తెల్లవారగానే అద్భుత దర్శనం.  పంచభూత శివాలయాల్లో అగ్ని లింగం అయిన, అరుణాచల శివుడు చక్కటి దర్శనం ప్రసాదించాడు.  కరోనా కాలంలో మొదటి క్షేత్ర దర్శనం కావడంతో, కొంత అనుమానం, భయం ఉన్నమాట అంగీకరించవలసిన వాస్తవం.  కానీ, అన్నీ పటాపంచలు చేస్తూ, చక్కటి దర్శనం దొరికింది.  కొంచెం కూడా తోపులాటలు లేవు.  ప్రశాంతంగా దర్శనం అయ్యింది.  ఇంకా ఆలయదర్శనాలు చేసుకోవడానికి చక్కటి ప్రోత్సాహం దొరికింది.  అమ్మవారి దర్శనం కూడా చేసుకొని, తిరువారంగం బయలుదేరాం.   తిరువారంగంలో  ర...

తిరుమలవాసా…. శ్రీ జగదీశా

ఏమి మా భాగ్యం. మా జన్మ ధన్యం. ఏమి మా ఆనందం. మా మది నందనందనం. స్వామిని ఇంత దగ్గరగా ఈ జన్మలో చూస్తానని ఊహించలేదు . గర్భగుడి దాకా వెళ్ళాకా, కళ్ళారా నిలువెత్తు విగ్రహాన్ని చూ...

మదురై - రామేశ్వరం

Image
ఏమి నా భాగ్యం.. గత ఏడాదినుంచి ఎన్నోసార్లు వెళ్లాలని ప్రణాళికలు కూడా వేసుకున్నా, కుదరక వెళ్లలేకపోయిన అద్భుత ఆలయమాలల  సందర్శనాభాగ్యం ఎట్టకేలకు దొరికింది.  ఎన్ని క్షేత్రాలు, ఎన్ని అద్భుత దర్శనాలు, ఎంత ఆనందం, ఏమి పారవశ్యం !!!   మదురై  మరియు  రామేశ్వరం  - రెండు ప్రదేశాలలో శివయ్య రెండు చేతులతో హత్తుకొని లోనికి రమ్మని పిలిచినట్టు ఎంత చక్కటి దర్శనాలు !!! తిరుచెంగోడు లో స్వయంభూ గా వెలసిన అర్ధనారీశ్వర స్వామిని దర్శించుకున్నాం.  మార్గశిరమాసంలో ఉదయం 7 వరకూ, మరకతలింగ దర్శనం కూడా ఉంటుంది, అదృష్టవశాత్తూ ఆ దర్శన భాగ్యం కూడా దక్కింది.  ఇదే ఆలయ ప్రాంగణంలో సుబ్రహ్మణ్య స్వామి కూడా స్వయంభూ గా వెలిసాడు.  ఆయనని కూడా చక్కగా దర్శించుకొని ప్రయాణం కొనసాగించాం.  మదురై దగ్గరలో అళగర్ కొండమీద ఉన్న సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనం ఎంతో బాగుంది.  చక్కగా స్వామి ముందు రెండు నిముషాలు కూర్చోనిచ్చి పంపించారు.  ఇది 6 సుబ్రహ్మణ్య క్షేత్రాలలో ఒకటి.   దర్శనం చేసుకొని వచ్చేసరికి కొండ దిగువన ఉన్న పెరుమాళ్ ఆలయం తెరిచిల...

అయ్యప్ప దర్శనం

Image
 ఎన్నాళ్లకెన్నాళ్లకు ఈ వైభోగం !!!  ఎలా అయితేనేం, అయ్యప్ప స్వామి కొండకి వెళ్లి వచ్చాను.  స్వామిని కళ్లారా దర్శించుకోగలిగాను.  విపరీతమైన రద్దీలో కూడా ప్రశాంతమైన దర్శనం ప్రసాదించాడు, ఆ హరిహర పుత్రుడు.  ఇన్ని రోజులకు దొరికిన అదృష్టం కొద్దీ, శబరిమల ఎక్కుతూ శరణుఘోష వినగలిగాను.  అంత పెద్ద కొండపై, ఇంకా పెద్ద గుడిలో, చిన్ని విగ్రహం ఇంకా కళ్ళ ముందే ఉంది సుమా.  ఇంతమంది స్వామిమాల ఎందుకు వేసుకుంటారు, ఇంత కఠినమైన నియమాలని ఎలా పాటిస్తారు, నఖ-శిఖ పర్యంతం పవిత్రతని ఎలా కాపాడుకుంటారు, మనసుకి మలినాలు అంటకుండా ఎలా మండలదీక్ష చేస్తారు - ఇలా ఎన్నో ప్రశ్నలు నా మనసులో ఎప్పటినుంచో రగులుతున్నవే.  అదేమిటో విచిత్రం, అన్నిటికీ సమాధానం మాత్రం, అయ్యప్పని దర్శనంతో దొరికినట్టే అనిపించింది.  స్వామిని తన్మయత్వంతో ఆపాదమస్తకం కళ్ళతో జుర్రేస్తూ ఉంటే, ఎవరో భక్తుడు విసిరిన మొక్కుబడి మూట, నా ముక్కుకి తగిలి వాచింది.  "ఇన్నాళ్లు రాకుండా ఆలస్యం చేసావేం రా" అని స్వామి ముద్దుగా మందలించాడేమో. ఉదయాన్నే,  చంగనూరు లో రైలు దిగి, పంబ వరకూ బస్సులో వెళ్లాం.  అక్కడ ...

నివేదనలు - ప్రసాదములు

నివేదనలు 1) చూతఫలం= మామిడిపండు  2) ఖర్జూర= ఖర్జూరం.             3) నింబ= వేప 4) నారింగ= నారింజ 5) భల్లాతకీ= జీడిపప్పు 6) బదరీ= రేగు 7) అమలక= ఉసిరికాయ 8) శుష్కద్రాక్ష= కిస్మిస్ 9) అమృత లేక బీజాపూరం=  జామపండు 10) ఇక్షుఖండం= చెఱకుముక్క 11) కదళీఫలం, రంభా ఫలం= అరటిపండు 12) నారికేళం= కొబ్బరికాయ 13) జంభీర= నిమ్మ పండు 14) దాడిమీ= దానిమ్మపండు 15) సీతాఫలం= సీతాఫలం 16) రామఫలం= రామఫలము 17) కపిత్త= వెలగ పండు 18) శ్రీ ఫలం, బిల్వఫలం= మారేడు 19) మాదీ ఫలం= మారేడు పండ్లు 20) జంభూఫలం= నేరేడు 21) వాతాదం= బాదము పప్పు ప్రసాదములు 1) కుశలాన్నం = పులగం 2) చిత్రాన్నం= పులిహోర 3) క్షీరాన్నం= పరమాన్నం 4) పాయసం= పాయసం 5) శర్కరాన్నం= చక్కెరపొంగలి 6) మరీచ్యన్నమ్= కట్టు లేదా మిరియాల పొంగలి 7) దధ్యోదనం= పెరుగు అన్నము 8) తిలాన్నం= నువ్వులపొడితో చేసిన అన్నం 9) శాకమిశ్రితాన్నం= కిచిడీ 10) గుడాన్నం = బెల్లపు పరమాన్నం 11) సపాదభక్ష్యం= గోధుమనూకతో చేసిన ప్రసాదం  (గోధుమ నూక పంచదార నెయ్యి సమపాళ్ళలో వేసి చేసింది గాన ఆపేరు) 12) గుడమిశ్రిత ముద్గ సూపమ్= వడపప్పు 13) ...