Posts

Showing posts from 2016

పంచశైవ క్షేత్రాలు

Image
భక్తసులభుడు కదా శివుడు!!! మనం చిటికెడు ప్రేమ చూపిస్తే కొండంత కరుణ కురిపించేవాడు.  ఒక గుడిలో శివుని దర్శించుకోవాలని వెళ్తే, ఐదు శివాలయాలను చూసే భాగ్యం అందించాడు. ఒక్క పూటలో కళ్ళారా అన్ని దర్శనాలు అదృష్టమే కదా!!!  2000+ సంవత్సరాల నాటి శివాలయాలవి. ఈ ఐదు కూడా పరమశివుని పరమ పావన క్షేత్రాలు. రామతీర్ధాలు చుట్టుప్రక్కల తిరిగి తిరిగి, ఆ రామయ్య ఆశీర్వాదంతో రామలింగేశ్వరునితో సహా పంచశైవ క్షేత్రాలని చూశాం. సారిపల్లి గ్రామం మాకు ఈ భాగ్యాన్ని ప్రసాదించింది.  Places visited: శ్రీ దిబ్బి లింగేశ్వర స్వామి - సారిపల్లి - 10th July, 9AM శ్రీ రామ లింగేశ్వర స్వామి - సారిపల్లి - 10th July, 11:30AM శ్రీ చంపకేశ్వర స్వామి - సారిపల్లి - 10th July, 11:30AM శ్రీ సోమలింగేశ్వర స్వామి - సారిపల్లి - 10th July, 12:30PM శ్రీ మల్లికార్జున స్వామి - సారిపల్లి - 10th July, 1PM శ్రీ రామలింగ చోడేశ్వర స్వామి - కుమిలి - 10th July, 10AM శ్రీ రామ చంద్ర స్వామి - రామతీర్ధాలు - 10th July, 10:30AM

తారా తరణి - ఆది శక్తిపీఠం

Image
ఆది శక్తిపీఠాలు, వాటి వైశిష్ట్యం గురించి చదివి తరించండి. ఇంతటి మహిమాన్విత ప్రదేశం, మాకు దగ్గరోనే ఉందని తెలిసినదే తడవుగా తల్లి దర్శనానికి వెళ్ళి వచ్చాం.  బరంపురానికి దగ్గరలో ఉన్న తారా తరణి ఆలయ దర్శనం ఒక మధుర జ్ఞాపకం.  గర్భగుడిలోకి వెళ్ళి అమ్మవారిని దగ్గరగా చూసి పరవశించిపోయాం. నిజ బనకేశ్వరి ఆలయం ఇంకో విశేషం.  లంకలోని శాంకరీ దేవి ఇక్కడనుంచే తరలి వెళ్ళారట.  శివుడు పెద్ద పాములపుట్ట రూపంలో ఇక్కడ కనబడుతాడు. ఉజాలేశ్వరుడు కొండగుహలో వెలిసాడు.  వెతికి వెతికి ఆయన జాడ కనిపెట్టి దర్శించుకున్నాం.  హరునికిష్టమైన అభిషేకంతో ఆయన దీవెనలందుకున్నాం. బారువలోని రుద్రకోటిలింగేశ్వర స్వామిని, జనార్ధనుని ఆలయాన్ని చూసాకా, పొత్తంగిలోని పొత్తేశ్వర స్వామిని, ఉత్తరేశ్వర స్వామిని దర్శించుకున్నాం. అజ్ఞాతవాస సమయంలో గోహత్యాపాతక నిర్మూలనకై పాండవులచే నిర్మించబడిన మహాదేవుని మందిరాలవి. పూర్తి స్థలపురాణం చదివి తరించండి. Places visited on 4th Jun 2016: తారా తరణి ఆలయం - బరంపురం 10AM నిజ బనకేశ్వరి ఆలయం - 2PM ఉజాలేశ్వరుడు - 3PM రుద్రకోటిలింగేశ్వర స్వామి, బారువ 6:45...

కాశీపురాధీశా!!!

Image
క్రితం సారి మనం కలుసుకున్నప్పుడు నిన్ను అడిగా కదా.. కానీ, నీ సన్నిధిలో 9 రోజులు గడపాలి అన్న సంకల్పాన్ని ఇంత త్వరగా నెరవేరుస్తావని అనుకోలేదయ్యా!! నేను ఎలా ఊహించుకున్నానో, అలాగే రోజులు గడిచిపోయాయి.  చెప్పలేని ఆనందం, అంతులేని తృప్తి ఇచ్చావు.  ఈ జన్మంతా నెమరువేసుకోడానికి సరిపడా తీపి జ్ఞాపకాలు పెట్టెలో సర్దుకుని తిరుగు ప్రయాణమయ్యామయ్యాం !!! రోజూ గంగలో స్నానం, నీ దివ్య దర్శనం, భోజనం, మళ్ళీ దర్శనం, వీలైతే ఇంకో దర్శనం - ఇలా గడిచిన పరమ పావనమైన రోజులవి.  ఎన్ని సార్లు తలుచుకున్నా తనివితీరడం లేదయ్యా, శివయ్యా... తొలిసారి నిన్ను స్పృశించిన అనుభూతి వర్ణనాతీతం.  మళ్ళీ మళ్ళీ నిన్ను తాకి పరవశించిన ఈ చేతులను ఎన్ని సార్లు ముచ్చటగా చూసుకున్నానో నీకు తెలుసుగా...  కేదార్ ఘాట్ లో ఒక మధుర  స్మృతి Places visited: 12th May - 22nd May విశ్వనాధుడు, అన్నపూర్ణమ్మ కాశీ విశాలాక్షి 18th May వారాహీ దేవి తిలభాండేశ్వరుడు కాలభైరవుడు బిర్లా టెంపుల్ సార్ నాధ్ సంకట మోచన్ హనుమాన్ దుర్గా మాత ఆలయం తులసీ మానస మందిరం త్రిదేవ్ ఆలయం గవ్వలమ్మ మందిరం చింతామణి గణపతి స...

వస్తున్నాం వస్తున్నాం.. లింగమయ్యా

Image
ఈ మాట పలుకుతూ జన సంద్రం నల్లమల అడవుల్లో దేవదేవుని దివ్యదర్శనానికై కదిలింది.  మండే ఎండలు కూడా లెక్కచెయ్యకుండా అడవంతా హరహర నామస్మరణతో పులకించింది. ఈ మహా యజ్ఞంలో మేముకూడా సమిధలు అవడం మహదభ్గాగ్యం కదూ... అసలు ఈ యాత్ర ప్రారంభమే ఒక అద్భుతం. చిలుకూరు బాలాజీ దర్శనంతో ప్రారంభించడం వల్ల సర్వం శుభప్రదమే కదా. సాయంత్రం వెళ్ళడంతో భక్తజనం తక్కువగా ఉండి చక్కటి దర్శనం ఎక్కువసేపు చేసుకున్నాం. స్వామి పక్కనున్న శ్రీదేవి భూదేవి కూడా కన్నులవిందుగా కనిపించారు. శ్రీరాముడు శ్రీశైలం ఉత్తర ద్వారంలో ఉన్న ఉమా మహేశ్వరుడిని దర్శించుకొని ఆ తరువాతే మల్లన్నని పూజించాడట.  అటువంటి స్వామికి అభిషేకం చేసుకొని సలేస్వరం బయలుదేరాం.  సలేశ్వరం అడవుల్లో వెలసిన లింగమయ్య ఏటా చైత్రపౌర్ణమికి మాత్రమే దర్శనమిస్తాడు. ఈ ఏడు మమ్మల్ని కూడా పిలిచాడు. పౌర్ణమి వెలుగులో 6 మైళ్ళు అడవిలో కొండలు ఎక్కీదిగీ ఆయనపై మాకున్న ప్రేమని చూపిస్తే, పరమ సంతోషంతో బదులుగా తన దివ్యదర్శనం ప్రసాదించాడు.  అక్కడ నుంచి శ్రీశైలం వెళ్ళే త్రోవలో బుగ్గ మల్లన్న దర్శనం ఇంకొక అనిర్వచనీయ అనుభూతి.  ఆ తరువాత మల్లికార్జునుని, భ్రమరాంబికా దేవిని...

మహేంద్రగిరిలో శివదర్శనం

Image
శివునికి మనమీద ప్రేమ ఎలాగూ ఉంటుంది.  తండ్రి తన బిడ్డలపై ప్రేమ చూపించడం చిత్రమేమీ కాదుగా.. మరి ఆ తండ్రిపై పిల్లలు కూడా తిరిగి ప్రేమ చూపిస్తే, మనకే కాదు, ఆ దేవదేవునికి కూడా అపరిమిత ఆనందమే.  ఇష్టపడితే 15km కొండల్లో ఎక్కిదిగి, విశ్వేశ్వరుని దర్శించుకు రావడం, అంత పెద్ద కష్టమేమీకాదు, అని ఇంకోసారి ఋజువయ్యింది. "నాకోసం ఇంత దూరం వచ్చారా నాయనలారా" అని శివుడు ఆనందించినట్లు అనిపించింది.  మాతోపాటు, మా అమ్మాయి కూడా హాయిగా అంత దూరం వచ్చేసింది.  పాండవులు అరణ్యవాసం చేసిన ప్రదేశంలో వెలిసిన శివాలయాలు అవి.  అనుభవించితే కానీ అందని అమితానందాన్ని గుండెలనిండా నింపుకొని తిరిగి వచ్చాం.   స్థల పురాణం చదువుకొని తరించండి. Temples visited: కొరసవాడ - సోమేశ్వరుడు - 9AM  పాతపట్నం - నీలమణి దుర్గ అమ్మవారు - 10AM పాతపట్నం - కేదారేశ్వరుడు మరియు నీలకంఠేశ్వరుడు - 10:30AM మహేంద్రగిరి - గోకర్నేశ్వరుడు (కుంతి నిర్మించిన ఆలయం) మరియు యుధిష్టరుడు ప్రతిష్టించిన ఆలయం - 5PM

మరో అద్భుత దర్శనం

Image
ఇంకోసారి శివకరుణతో అద్భుత శివదర్శనాలు జరిగాయి. యనమదుర్రు శివాలయం ఎంతో విశిష్టమైనది.  శివుడు శీర్షాసనంలో తపస్సు చేస్తూ ఉంటే అమ్మవారు  సుబ్రహ్మణ్యుని ఒళ్ళో పడుకోపెట్టుకుని ఉంటుంది.  అతి ప్రాచీన చరిత్రగల క్షేత్రమిది. ఇంకొక విశేషమైన ఉమా రామ లింగేశ్వర స్వామి ఆలయం, గొల్లప్రోలు దగ్గర  దుర్గాడ అనే ఊరిలో ఉంది. లింగం పైన ఒక రాయి ఉండటం విశేషం. ఇది పంచాయతన శివాలయం.  Temples visited: యనమదుర్రు - శక్తీశ్వర స్వామి - 10AM  భీమవరం - సోమేశ్వర స్వామి - 10:30AM పాలకొల్లు - క్షీరా రామ లింగేశ్వర స్వామి - 11:30AM అయినవిల్లి - సిద్ధి విఘ్నేశ్వర స్వామి - 1PM దుర్గాడ - ఉమా రామ లింగేశ్వర స్వామి - 4PM పిఠాపురం - కుక్కుటేశ్వర స్వామి, పురుహూతికా శక్తి పీఠం - 5PM

గిరిజమ్మ కరుణించింది

Image
ఎన్నాళ్ళకెన్నాళ్ళకు!! గత 6-7 నెలలుగా ఈ పిలుపు కోసం ఎదురు చూపు.  ఇన్నాళ్ళకు సాకారమైనదీ కల.  గిరిజాదేవి (బిరజాదేవి) దయతలిచింది, కన్నులపండుగగా అద్భుతమైన దర్శనంతో తనువు, మనసు పులకరించాయి. గుడి 1-3pm మూసివేస్తారంట.  అందుకని, 2-3 గంటలు కోవెల ఆవరణలోనే గడిపే అదృష్టం కూడా దక్కింది. శక్తిపీఠంలో అలా ఉండగలగడంకూడా వరమేకదా!!! ఆలయ ప్రాంగణంలో చాలా శివలింగాలు ఉన్నాయి.  10-15 సహస్రలింగాలు కూడా ఉన్నాయి.  చూసి తీరాల్సిన ఈ అద్భుతాన్ని మాటల్లో వర్ణించడం చాలా కష్టం సుమా !!! ఇంకొక విశేషమేమిటంటే, ఇది నాభిగయ క్షేత్రం.  గయ, జాజ్ పూర్, పిఠాపురం - ఈ మూడు క్షేత్రాలు కలిపి గయ క్షేత్రాలు. Places visited: నాభి గయ క్షేత్రం - జాజ్ పూర్ - 1:30PM గిరిజా దేవి శక్తి పీఠం - జాజ్ పూర్ - 3PM

లింగోద్భవ అద్భుతం

Image
శివునికి పరమ ప్రీతిపాత్రమైన శివరాత్రినాడు, శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో శివదర్శనం...  అనన్యసామాన్యమైన ఈ దివ్యానుభూతి నీ కరుణాకటాక్షమే కదా ఈశా. నీ సన్నిధానంలో శివరాత్రినాడు మెసిలానన్న ఆలోచన వస్తే చాలు, ఎంతో అద్భుతంగా ఉంది తెలుసా.  అమ్మ ఎదురుగా ఎంతసేపు నిల్చున్నానో నాకే తెలియదు.  జ్ఞాన ప్రసూనాంబ నన్ను గమనించే ఉంటుందిలే. ఈసారి నిన్ను వెతికే పనిలో దొరికిన మరొక అద్భుతం - గుడిమల్లం లో శ్రీ పరశురామేశ్వర స్వామి.  బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఏక శిలలో స్వయంభూ గా వెలిసిన అరుదైన, అతి ప్రాచీనమైన క్షేత్రాన్ని దర్శించే భాగ్యాన్ని ప్రసాదించావు.  వేంకటేశ్వర స్వామి తిరుగాడిన ప్రదేశాలు చూశాం.  ఆయనకు, పద్మావతి అమ్మవారికి వివాహమైన ప్రదేశాలకు, వెళ్ళగలిగామంటే మాటలా ?  వివాహంలో నలుగుపిండి విసిరిన తిరగలి చూశాం.  అంతా నీ లీలలే లే ఈశా !!! శివుని భక్తాగ్రణ్యునితో ఒక సెల్ఫీ... Temples Visited : శ్రీకాళహస్తి - శ్రీకాళహస్తీశ్వర స్వామి, జ్ఞాన ప్రసూనాంబ - 7th Mar 2PM and 8th Mar 4AM గుడిమల్లం - శ్రీ పరశురామేశ్వర...

పంచ శైవ క్షేత్రాలు

Image
మహావిష్ణు అవతారమైన బలరాముడు  ప్రజల నీటిబాధలు చూడలేక తన ఆయుధమైన  నాగలితో నాగావళిని సృష్టించాడు. అదే ప్రజల ఈతిబాధలు కూడా తీరాలిగా.  అందుకే, సర్వకాలములలో జనులు శివనామంకితులు అయ్యేలా దీన జనోద్ధరణకై ఆ నది ఒడ్డునందు ఐదు శైవక్షేత్రాలను ప్రతిష్టించాడు. అవి పంచ శైవ క్షేత్రాలు గా వాసికెక్కాయి. ఒకేరోజు ఆ పంచ శైవ క్షేత్రాలను దర్శించుకుంటే శివకృప వల్ల మోక్షం లభిస్తుంది. 20-02-2016 - శనిత్రయోదశి నాడు శివయ్య మాకు ఆ భాగాన్ని కలిగించాడు.  క్రింద చూపిన #1, #3, #6, #7, #8 కోవెలలు కలిపి పంచ శైవ క్షేత్రాలు. Temples visited: శ్రీ పాయకేశ్వర స్వామి -  తెరువలి, రాయగడ - 10AM మజ్జి గౌరమ్మ - రాయగడ - 10:30AM శ్రీ సోమేశ్వర స్వామి - గుంప, పార్వతీపురం - 1:30PM శ్రీ వేంకటేశ్వర స్వామి - తోటపల్లి, పార్వతీపురం - 2:30PM శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి - అడ్డాపుశిల, పార్వతీపురం - 3PM శ్రీ సంగమేశ్వర స్వామి - సంగం, రాజాం - 4PM శ్రీ మణి నాగేశ్వర స్వామి - కల్లేపల్లి, శ్రీకాకుళం - 7PM శ్రీ ఉమా రుద్ర కోటేశ్వర స్వామి - శ్రీకాకుళం - 8PM ...

2016 - ఆరంభం అదిరింది

Image
2016 కి అద్భుత ఆరంభం... తొలి రోజునే తోలితిరుపతి లో శృంగార వల్లభ స్వామి దర్శనంతో ప్రారంభం. చిరు మందహాసంతో వెలిగిపోతున్న స్వామి అందం ఎలా వర్ణించను? ఎంతని కీర్తించను ? శివ కేశవులిద్దరూ దీవించి, 11 ఆలయాల్లో మాకు దర్శన భాగ్యం కల్పించారు.  పురుహూతికా శక్తి పీఠ దర్శనం ఒక ప్రత్యేక అనుభూతి... అమ్మ సన్నిధి లో 30 నిముషాలు, 30 సెకన్లుగా గడిచిపోయాయి. ర్యాలీ లో ఓ మధుర స్మృతి... Temples visited: శృంగార వల్లభ స్వామి -  తొలితిరుపతి - 1st Jan 2016 7 PM కుక్కుటేశ్వర స్వామి మరియు పురుహూతికా శక్తి పీఠం - పిఠాపురం - 1st Jan 2016 8 PM భీమేశ్వరుడు - సామర్లకోట - 2nd Jan 6AM భావన్నారాయణ స్వామి - సర్పవరం - 2nd Jan 7M వీరేశ్వర స్వామి - మురమళ్ళ - 2nd Jan 8AM క్షణముక్తీశ్వరుడు - ముక్తేశ్వరం - 2nd Jan 9AM వినాయకుడు - అయినవిల్లి - 2nd Jan 10AM మందేశ్వర (శనీశ్వర) స్వామి - మందపల్లి - 2nd Jan 11AM మోహినీకేశవస్వామి మరియు ఉమాకమండలేశ్వర స్వామి - ర్యాలీ - 2nd Jan 11:30AM మహానందీశ్వర స్వామి - పోలవరం - 2nd Jan 2PM వీరభద్రుడు - పట్టిసం (పట్టిసీమ) - 2nd Jan 4PM ...