చూసావా, శివా !!! నిన్ను బతిమాలి, విసిగించి, ఒప్పించి, నీ వెండిఇంటికి చేరుకున్నా!!! నీ కైలాసావాసం చూసినందుకు నాకు ఆనందం, నీకు నా నస నుంచి చిన్న విరామం... నమ్మినందుకు ఉన్నానని నాకు ఈ అదృష్టం కలిగించావని నమ్ముతున్నాలేవయ్యా, శంకరా !!! శివాజ్ఞ అయ్యాకా, ఇక తిరుగేముంది... భువనాలనేలే రాజువి, నీ దయతో నీ ఇంటికి రావటం, పూర్వ జన్మ సుకృతమే... నీ ఇల్లే కదా, ఇక్కడెక్కడైనా కనిపిస్తావేమో అని నా కళ్ళు నిన్ను వెతకడం, నీకు తెలుస్తోందిగా... మరి కనబడి కరుణించరాదా, కైలాసవాసా... సరేలే, కనబడేదాకా నిన్ను నే వదలను, కనబడినాకా నీ తోనే నేను... ఒక్క కోరిక తీర్చు, కడ దాకా నీ ఆలోచనలు, కడతేరాకా నీ చరణాలు... వదలకుండా నన్ను నీ వెంట ఉండేలా ఓకంట కనిపెట్టు, కారుణ్యమూర్తీ... Daily highlights of the trip are captured here . Places visited: మానస సరోవరం, టిబెట్ - 2nd Sep 2PM కైలాస పర్వతం, టిబెట్ - 3rd Sep 10AM (parikrama start) పశుపతినాథ్, ఖాట్మండు - 7th Sep 10AM జల్ నారాయణ్, ఖాట్మండు - 7th Sep 3PM