Posts

తృటి

మనం అప్పుడప్పుడు వింటుంటాం.. పత్రికలలో చదువుతుంటాం..  "తృటి" లో తప్పిన ప్రమాదం,  అని.. అసలీ తృటి అంటే ఏమిటి?  మన పూర్వీకులు మనం కాలాన్ని ఎన్ని భాగాలు గా విడదీసారో, వాటి పేర్లేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.. తృటి =సెకండ్ లో 1000 వంతు 100 తృటులు =1 వేద 3 వేదలు=1 లవం 3 లవాలు=1 నిమేశం అంటే రెప్ప పాటుకాలం నిముషం కాదు..  3 నిమేశాలు=1 క్షణం, 5 క్షణాలు=1 కష్ట 12 కష్టాలు = ఒక నిముషం  15 కష్టాలు=1 లఘువు 15 లఘువులు=1 దండం 2దండాలు=1 ముహూర్తం 2 ముహూర్తాలు=1 నాలిక 7 నాలికలు=1 యామము,ప్రహారం 4 ప్రహరాలు=ఒక పూట 2 పూటలు=1 రోజు 15 రోజులు=ఒక పక్షం 2 పక్షాలు=ఒక నెల. 2 నెలలు=ఒక ఋతువు 6 ఋతువులు=ఒక సంవత్సరం. 10 సంవత్సరలు=ఒక దశాబ్దం 10 దశాబ్దాలు=ఒక శతాబ్దం. 10 శతాబ్దాల=ఒక సహస్రాబ్ది 100 సహస్రాబ్ది=ఒక ఖర్వ..లక్ష సంవత్సరాలు 4లక్షల 32 వెల సంవత్సరాలు= కలియుగం 8లక్షల 64 వేల సంవత్సరాలు=త్రేతాయుగం 12లక్షల 96 వేల సంవత్సరాలు=ద్వాపర యుగం 17లక్షల28 వేల సంవత్సరాలు=కృత యుగం పై 4 యుగాలు కలిపి=చక్రభ్రమణం.(చతుర్ యుగం) 71 చక్రభ్రమాణాలు=ఒక మన్వంతరం 14 మన్వంతరాలు=ఒక కల్పం 200 కల్పాలు ఐతే=బ్రహ్మరోజు 365 బ్రహ్మర...

అష్టాదశ పురాణాలు

మనం అనేక సందర్భాల్లో ‘అష్టాదశ పురాణాలు’ అని వింటూ ఉంటాం. అయితే ఆ 18 పురాణాల పేర్లూ ఒకపట్టాన గుర్తుకు రావు. ఒకవేళ అన్నింటి పేర్లూ తెలిసినా, ఏ పురాణంలో ఏముందో తెలియని పరిస్థితి. అనంతంగా ఉన్న ఈ పౌరాణిక విజ్ఞానాన్ని, అపారమైన వేదరాశిని వేదవ్యాసుడే అంశాల వారీగా విభజించాడు. అందుకే విష్ణుసహస్రనామంలో వ్యాసాయ విష్ణురూపాయ.. వ్యాసరూపాయ విష్ణవే అని ఉంటుంది. వేదవ్యాసుడు పురాణాలను రచిస్తే, వాటిని మహాపౌరాణికుడు సూతుడు శౌనకాది మునులకు చెప్పాడు. వారి ద్వారా ఇవి లోకానికి వెల్లడయ్యాయి. ఎంతో విస్తారమైన ఈ పురాణాలను మనం చదవలేకపోయినప్పటికీ, అసలు ఆ పురాణాలేమిటి, ఏ పురాణంలో ఏముందో రేఖామాత్రంగా అయినా తెలుసుకోగలిగితే అవకాశం ఉన్నప్పుడు విపులంగా తెలుసుకోవచ్చు.   18 పురాణాల పేర్లు :  1.⁠ ⁠మత్స్యపురాణం  2.⁠ ⁠కూర్మపురాణం  3.⁠ ⁠వామన పురాణం  4.⁠ ⁠వరాహ పురాణం  5.⁠ ⁠గరుడ పురాణం  6.⁠ ⁠వాయు పురాణం  7.⁠ ⁠నారద పురాణం  8.⁠ ⁠స్కాంద పురాణం  9.⁠ ⁠విష్ణుపురాణం 10.⁠ ⁠భాగవత పురాణం 11.అగ్నిపురాణం 12.⁠ ⁠బ్రహ్మపురాణం 13.⁠ ⁠పద్మపురాణం 14.⁠ ⁠మార్కండేయ పురాణం 15.⁠ ⁠బ్రహ్మవైవర్త పురాణం 16.లింగపురాణం 17.బ్రహ్మాండ పురాణం 18.⁠ ⁠భవిష్యపురా...

ఆత్మానుభూతి

 అనన్య భక్తి భగవంతుడు సృష్టించిన పదార్ధాల తో తిరిగి భగవంతుని ఆరాధించటం కాకుండా, మన మనో పుష్పాన్ని భగవంతునికి  అర్పించటమే అనన్య భక్తి! ఈ మనో పుష్పం శుద్ధమై ఉండాలి.! దానికి ముందు ఇంద్రియ నిగ్రహం, సర్వ భూతదయ, శాంతి, క్షమా అహింసలు, తపము, ధ్యానం, సత్యం ఇవన్నీ సాధించాలి. నిరంతరం తపన, సాధన చేయాలి. ప్రతీ జడ, జీవ పదార్ధము పరమాత్మ స్వరూపమే అన్న దాన్ని అనుభూతి పొందాలి. విశ్వం అంతటా పరమాత్మ చైతన్యమే నిండి ఉంది అని తెలుసు కొంటేనే ఆ శక్తి మనలో, జడ, జంతు జీవాలలో ఉంది అని అర్ధం అవుతుంది. మనసు ఎపుడు కూడా బైటకే, బాహ్య వస్తువుల వైపే పరుగులు తీస్తూ ఉంటుంది. అలాంటి మనసుని శుద్ధి చేసుకొని అంతర్ముఖం చేయాలి. మనసు, బుద్ధి ఏకమై ఆత్మలో లయం అవ్వాలి...      లేదా మనసే ఆత్మగా ప్రకాశించాలి. చిత్త శుద్ధి పొందిన మనసుని ఆత్మలో ప్రతిష్టించాలి!. ఇలాంటి మనో పుష్పాన్నే భగవంతునికి సమర్పించాలి! ఇదే అనన్య భక్తి, ఆత్మానుభూతి. గృహస్తు అయినా, బ్రహ్మ చారి అయినా, సన్యాసి అయినా మనసు శుద్ధి చేసుకొంటే కానీ భక్తుడు కాలేడు. చిత్తశుద్ధి లేని పూజ పరమాత్మ స్వీకరించడు.ముక్తి పొందాలంటే భక్తి కావాలి.భక్తి అంటే అనన్య భక...

మౌనం 🤫

మౌనం ఒక మానసిక నిశ్శబ్దం. మాట ఓ భౌతిక శబ్దం. మౌనం ఓ సమస్యకు పరిష్కారం. మాట ఒక సమస్యకు కారణం. మాట హద్దులు దాటితే యుద్ధం. మౌనం హద్దులు దాటితే ఆత్మ జ్ఞానం.  కొన్నిటికి సమాధానం మౌనం. కొన్నిటికి సమాధానం మాట. మాట మౌనం రెండు అవసరం. వాటిని వాడే విధానం తెలుసుకోవాలి.  అది తెలిసిన వారు ప్రతిక్షణం ఆనందంగా ఉండగలరు. మౌనమంటే మాట్లాడక పోవడం కాదు, మూగగా ఉండి సంజ్ఞలు లేదా వ్రాతలు ద్వారా మన భావనలను వ్యక్తపరచడం కాదు. నిశ్శబ్ధంగా ఆలోచించడం కాదు, వాక్కుని నిరోధించి మనస్సుతో భాషించడం కాదు, మౌనమంటే అంతరింద్రియ విజ్రుంభణను ఆపడం. మనో, బుద్ధి, చిత్త, అహములతో కూడిన అంతఃకరణమునే అంతరింద్రియమంటారు. మౌనమంటే ఆలోచనలు, ఆవేదనలు, ఆక్రోషములు, భ్రాంతులు, వాంఛలు, వాక్కులు లేకుండా మనల్ని మనం స్పష్టంగా చూసుకోవడం. ఆత్మయందు పూర్ణమైన ఏకాగ్రత కలిగియుండడమే మౌనం. మౌనమంటే - నిరంతర భాషణ. చింత, చింతన లేని తపస్సు.  అఖండ ఆనందపు ఆత్మస్థితి. విషయ శూన్యావస్థ. యోగస్య ప్రధమం ద్వారం వాజ్నిరోధః అన్నారు శ్రీ ఆదిశంకరులు. మౌనమే దివ్యత్వ దర్శనమునకు ద్వారం. అదే సర్వానికి మూలం.  అదే మహార్ణవం. సర్వస్వమూ అందులోనుంచే మొదలై, తిరిగి అంద...

హృదయార్పణం

మనిషి తనకు మానవజన్మ ప్రసాదించిన భగవంతుడికి అనేక విధాలుగా పూజలు చేస్తుంటాడు... పూజా సమయంలో యథాశక్తి తనకు ఉన్నంతలో పత్రమో,పుష్పమో,ఫలమో,  జలమో సమర్పించుకుంటూ ఉంటాడు.  ఈ విధంగా సమర్పించడం కృతజ్ఞతా సూచకం అయితే కావచ్చునేమోగానీ, అసలు మనిషి భగవంతుడికి సమర్పించగల శక్తిమంతుడేనా?  ఇలా ఆలోచిస్తే, ఎంతమాత్రం కాదని చెప్పవచ్చు. భగవంతుడిదే ఈ యావత్‌సృష్టి. అలాంటివాడికి భక్తుడు ఇచ్చే కానుకలు అత్యల్పమైనవే. కానీ ఏదో ఒకటి సమర్పించకపోతే భక్తుడి మనసు వూరుకోదు. పూర్వం ఒక యోగి భగవంతుణ్ని అర్చించడానికి సిద్ధమయ్యాడు. అప్పుడు అతడిలో వివేకం ఉదయించింది. పూజలో ఒక్కొక్క ఉపచారాన్నీ చేస్తూ భగవంతుడితో ఇలా విన్నవించుకున్నాడు- 'పరమేశ్వరా!  నీవు బ్రహ్మాండమంతా నిండిఉన్నావు. కనుక నిన్ను ఎలా ఆవాహన చేయాలి?  అన్నింటికీ ఆధారమై నీవు ఉండగా నీకు ఆసనం ఎక్కడ వేయాలి?  నిరంతరం స్వచ్ఛంగా ఉండే నీకు కాళ్లు కడుక్కోవడానికి నీళ్లెందుకు? పరిశుద్ధుడవైన నీకు ఆచమనం అవసరమా? నిత్య నిర్మలుడవైన నీకు స్నానం ఎలా చేయించాలి? ప్రపంచమంతా నీలోనే ఉండగా నీకు వస్త్రం ఎలా ధరింపజేయాలి?  గోత్ర వర్ణాలకు అతీతుడవైన నీకు యజ్ఞోపవీతం అ...

జీవన కాలమ్

*గురజాడ అప్పారావు గారు వెళ్లిపోతున్నారని తెలిసినప్పుడు, కుటుంబ సభ్యులు వైద్యుడిని, పిలిపించారట.*  *అప్పారావు గారు వైద్యుడిని చూసి.. ‘తాంబూలం వేసుకోవాలని ఉందయ్యా’ అన్నారట.*  *వైద్యునికీ పరిస్థితి తెలుస్తోంది. తాంబూలం ఇచ్చారట. వేసుకున్న తర్వాత ఆయన శాశ్వతంగా వెళ్లిపోయారు.* *మొన్న అప్పారావుగారి శత వర్ధంతి సభలో ఆయన మునిమనుమడి భార్య, ఈ విషయాన్ని చెప్పారు.* *ప్రముఖ రచయిత కుష్వంత్‌సింగ్ తల్లి 94 సంవత్సరాలు బతికారు. ఆమె పక్కన కూర్చుని కుష్వంత్‌సింగ్ తల్లిని అడిగారట- ‘ఏం కావా’లని.*  *’ఓ పెగ్గు స్కాచ్ కావాల’న్నారట ఆమె.*  *ఒంగోలులో మా మిత్రుడి తండ్రిని, చివరి రోజుల్లో నేను చూశాను. చాలా నెలల తర్వాత మా మిత్రుడు ఫోన్ చేశాడు - నాన్న వెళ్లిపోయాడని.* *చివరి క్షణాల్లో కొడుకుని పిలిచి - ‘ఓ గ్లాసుతో బ్రాందీ కావాలన్నారట. తాగి, ఒక సిగరెట్టు కాల్చి హాయిగా కన్నుమూశాడు.* *మృత్యువుని మజిలీగా, గుర్తు పట్టడం గొప్ప సంస్కారం.* *మృత్యువుని సెలబ్రేట్ చేసుకోవడం ఇంకా గొప్ప సంస్కారం. దుఃఖం ఒక దృక్పథం. నిర్వేదం ఒక బలహీనత.* *భారతీయ సంస్కృతి మనిషి పుట్టినప్పటి నుంచీ, ఒక ఆలోచనకు మనల్ని తర్ఫీదు చేస్తుంది - ...

ధర్మమే గెలుస్తుంది

*_అందరూ అంటుంటారు ధర్మమే గెలుస్తుంది అని..._* *_అది తప్పు...! ధర్మం దానంతట అదే గెలవదు..!_* *_నువ్వు గెలిపించాలి, మనం కలిసి గెలిపించాలి..!_* *_అర్థం కాలేదా...?_* *_ఒక్కసారి నెత్తుటితో తడిసిన చరిత్ర పుస్తకాలలోకి తొంగి చూడు..!_* *_కృత యుగం లో…_* *_తన భక్తుడైన ప్రహ్లాదున్ని కాపాడడానికి ధర్మ సంస్థాపనకు భక్తుడి కోసం భగవంతుడు ఉన్నాడు. అని చెప్పడం కోసం, సత్యాన్ని స్థాపించడం కోసం, అణువు అణువు లో భగవంతుడు నృసింహ రూపంలో వ్యాపించి అహోబిల క్షేత్రంలో  ఒక స్తంభం నుండీ వచ్చాడు._* *_హిరణ్య కశ్యపుడిని సంహరించాడు._* *_ధర్మాన్ని, సత్యాన్ని స్థాపించడం కోసం భగవంతుడు ఎన్నో రూపాలు ధరించి, కష్టాలు పడుతూ ఉంటాడు._* *_త్రేతాయుగంలో…_* *_రాముడి భార్యను రావణాసురుడు ఎత్తుకెళ్ళాడు,_* *_సరేలే ధర్మమే గెలుస్తుంది కదా, తన సీత తిరిగి వస్తుంది అని…  రాముడు చేతులు కట్టుకొని గుమ్మం వైపు చూస్తూ కూర్చోలేదు._* *_రావణాసురుడి మీద ధర్మయుద్ధం ప్రకటించాడు._* *_ఆ రాముడికి అఖండ వానరసైన్యం తోడై ధర్మం వైపుకు అడుగులు వేశారు._* *_ఆ యుద్ధంలో రాముడికి సైతం గాయాలు అయ్యాయి. తన భుజాలను, తొడ భాగాల చర్మాన్ని బాణాలు చీల్చుకొని వెళ్ళాయి._*...

కర్మ ఫలం

కర్మ ఫలం..తప్పదు ఎవరికైనా అనుభవించక..! మన పాప కర్మే గ్రహ రూపంలో వచ్చి బాధిస్తుంది..! కర్మ బలీయమైనది..! రాజును కాటు వెయ్యాలని బయల్దేరాడు తక్షకుడు.  కశ్యపుడనే బ్రాహ్మణోత్తముడు - మంత్రవేత్త రాజును సంరక్షింప, రాజప్రాసాదానికి బయలుదేరాడు  ఇంకోకవైపు నుంచి - దారిలో ఇద్దరూ ఒకరికొకరు తారసపడ్డారు. తక్షకుడు కూడా బ్రహ్మణవేషధారియై, కశ్యపుని చూసి "మహామహితాత్మా! తమరెవరు?  ఎచ్చటికీ పయనం?" అని అడిగాడు. "ఏదో బీద బ్రాహ్మణుడిని. రాజుగారు ఏనుగెత్తు ఐశ్వర్యం ప్రసాదిస్తానంటే,  నా మంత్రమహిమ వినియోగించే అవకాశం వచ్చింది కదా అని సంబరపడుతున్నాను" అంటూ దాపరికం లేకుండా అసలు విషయం చెప్పేశాడు. "అమాయక బ్రాహ్మణుడా! పరీక్షిన్మహరాజుని కాటూవేయబోయేది ఏదో నీటిపామో - బురద పామో అనుకుంటున్నావా?  సర్పరాజు వాసుకితో సమానుడైన ఇంకొక సర్పాధిపుడు - తక్షకుడే స్వయంగా అయితేనో?"  "తక్షకుడైనా కానిమ్ము!  అతడ్ని మించిన ఆదిశేషుడైనా కానిమ్ము!  నా దగ్గర ఉన్నదిగారడీ వాడి పాము మంత్రమో -  విషకీటక మంత్రమో అనుకుంటున్నావా?"  అని ప్రశ్నించాడు కశ్యపుడు. అంతగొప్పవాడివా! నేనే ఆ తక్షకుడ్ని" అని నిజరూపం చూపి...

పూజ ఎందుకు చేయాలి?

పై ప్రశ్న చిన్న పిల్లలు అడిగారు అంటే అర్ధం ఉంది, కానీ నేడు చదువుకున్న పెద్దవాళ్ళు కూడా, ప్రపంచ వ్యామోహము లో మునిగి, అరిషడ్వర్గాలలో తేలుతూ కూడా, ఇదే ప్రశ్న అడుగుతున్నారు. మనము వెంటనే, పూజ చేయక పోతే, కళ్ళు పోతాయి లేదా సంపదలు పోతాయి, లేదా చేస్తే సంపదలు వస్తాయి అంటాం. ఎందుకంటే, మనకు కూడా, పూర్తి అవగాహన ఉండదు, పూజ ఎందుకు అని.  మనము పెట్టే ప్రసాదము దేవుడు ఆరగిస్తున్నారా? ఆరగిస్తే, ఇక నైవద్యం పెడతామా, ఆయన కడుపు నిండాలంటే, ఎన్ని గుండిగల ప్రసాదం పెట్టాలి, తిరుపతి వెంకన్న దగ్గర పెట్టిన విధముగా? అందుకే ఆయన తేలికగా తెలివిగా, బీదవారు కూడా పెట్టగలిగే విధముగా, కాణీ ఖర్చు లేకుండా, మన మనసు నైవేద్యంగా పెట్టాలి అని ఎప్పుడో చెప్పారు.  దేవుడు నిరాకారుడు నిరంజనుడు. ఈ ప్రపంచమంతా వ్యాపించినవాడు నడిపిస్తున్నవాడు. నీలో నాలో ఉన్నాడు చైతన్యములా. ఆ చైతన్యము పోతే, మనిషి శవము తో సమానము. కాకపోతే, అది అర్ధం కావడానికి ఆచరణలో సాధన చేడానికి, మనసు నిలవాలి సహకరించాలి. దానికే పూజ మొదటి మెట్టు, మన కోసం. కొడుకు ఉన్నాడా ఇంట్లో !!!.. ఉన్నాడు... చాలు ... పెద్ద ఊరట. ‘‘జాతస్య  హి ధ్రువో మృత్యుః  ధ్రువం  జన్...

చిదంబరం - శ్రీరంగం

Image
సెలవులు దొరికితే చాలు, ఏ ఆలయాలకు వెళ్లి దర్శనాలు చేసుకుందామా అని ఆలోచన ఉంటే బావుంటుంది కదూ.  మన ఆలోచనలు అలా ఉంటే, ఆయన కూడా అటువైపు నడిపిస్తాడు సుమా.   ముందుగా, అరుణాచలం వెళ్లి, అగ్ని లింగాన్ని దర్శించుకున్నాం.  నెలరోజుల్లోన్నే, రెండోసారి దర్శనం ఇచ్చిన స్వామికి కృతఙ్ఞతలు చెప్పుకొని, అక్కడి నుంచి  వృద్ధాచలం  వెళ్లాం.  ఎంతో పురాతనమైన, అందమైన ఆలయం... ఆయనముందు చాలా సమయం గడపగలిగాం.  సుందర నాయనారు ని 12000 బంగారు నాణాలతో శివయ్య అనుగ్రహించిన దివ్య సుక్షేత్రం.  తనివితీరా స్వామిని కళ్లారా చూసుకొని, అక్కడినుంచి శ్రీముష్ణం వెళ్లాం.  అష్ట స్వయం వ్యక్త క్షేత్రాలలో ఒకటి అయిన ఈ అద్భుత ఆలయం చూడటానికి రెండు కళ్ళూ చాలవు.  స్వామి ఎంత చక్కగా ఉన్నారో... చాలాసేపు ఆయననే చూస్తూ ఉండిపోయేసరికి, ఆలయం మూసే సమయం అయిపోయింది.  అక్కడినుంచి చిదంబరం వెళ్లి అక్కడ రాత్రి బస. మరునాడు, చిదంబరం నటరాజ స్వామి, శివకామసుందరి.. ఇద్దరూ ఇద్దరే. గంటకి పైగా ఆలయంలో గడిపినా, తనివితీరలేదు.  పంచభూత శివాలయాల్లో, ఆకాశలిం...

అహోబిలం & మహానంది

Image
ఎంతటి ప్రేమ. .. అంతటా ఉన్నావని అంతా అంటున్నా, అంతులేని ప్రపంచమంతా నిన్నుగూర్చి వెతికే మా అజ్ఞానానికి నవ్వుకోక, 'వెర్రివాళ్ళు నాకోసమేకదా వెతుకుతున్నార'ని నీ అద్భుత దర్శనాలను ప్రసాదించేంత  ప్రేమ.  ఎంతటి దయ... ధ్యాన దానాది సత్కర్మలను సరిగా ఆచరించక, నీ దర్శనం మాత్రమే పుణ్యమనుకొనే  మాబోటి వాళ్ళ మూఢత్వానికి కోపించక, 'ఎప్పటికైనా తెలుసుకొంటారులే' అని జాలితో దీవించేంత దయ.  ఎంతటి కరుణ...  నీకోసం వచ్చే చిన్ని ఆలోచనని ధ్యాసగా,  ధ్యాసని ఇష్టంగా,  ఇష్టాన్ని భక్తిగా, భక్తిని ప్రేమగా...  నీవే భావించుకొని 'నీకేంకావాలో తీసుకోరా' అని కరుణించేంత కరుణ. ఉత్తరద్వార దర్శనంతో ప్రారంభమైన  వైకుంఠ ఏకాదశి,   ఆద్యంతం అద్భుతంగా సాగింది.   నవ నా రసింహులలో ఎనిమిది ఆలయాలని ఈ రోజు చూసాం.  ఒక్కో ఆలయం, ఒకటికి మించి ఒకటి... ఒక్కో దర్శనం, ఒకటితో  సరిపోలినది ఒకటి...  ఒక్కో విగ్రహం,  ఒకటి కాదు, సహస్ర విగ్రహాలకు సమానం.  శివ కేశవులకు అభేదం కదూ.. అందుకే, నరసింహస్వామిని 'నా మదిలో శివుడిని నిలపమని' అడిగా.  మహాలక్ష్మి ద...

అరుణాచల శివ

Image
అరుణగిరి ప్రదక్షిణం - ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న అదృష్టం ఇన్నాళ్ళకి మమ్మల్ని వరించింది.  అపీతకుచాంబ అమ్మవారు, అరుణాచలేశ్వరుడు కలిసి ఆశీర్వదిస్తే, తీరని కోరిక ఏముంటుంది ? 14 కిలోమీటర్లు, 11 శివాలయాలు, చక్కని సాయంత్రం నడక - ఇలా అందంగా సాగింది, అరుణగిరి పరిక్రమ.  అష్ట దిక్కులా, అష్ట దిక్పాలకులు ప్రతిష్టించిన అష్ట శివాలయాలు ,  వాటితోపాటు, సూర్య లింగం, చంద్ర లింగం, ఇంకా ఆది అన్నామలై ఆలయం.  అన్నీ దర్శించుకొని, ప్రశాంతంగా తిరిగి రావడానికి సుమారుగా 5 గంటలు పట్టింది. తెల్లవారగానే అద్భుత దర్శనం.  పంచభూత శివాలయాల్లో అగ్ని లింగం అయిన, అరుణాచల శివుడు చక్కటి దర్శనం ప్రసాదించాడు.  కరోనా కాలంలో మొదటి క్షేత్ర దర్శనం కావడంతో, కొంత అనుమానం, భయం ఉన్నమాట అంగీకరించవలసిన వాస్తవం.  కానీ, అన్నీ పటాపంచలు చేస్తూ, చక్కటి దర్శనం దొరికింది.  కొంచెం కూడా తోపులాటలు లేవు.  ప్రశాంతంగా దర్శనం అయ్యింది.  ఇంకా ఆలయదర్శనాలు చేసుకోవడానికి చక్కటి ప్రోత్సాహం దొరికింది.  అమ్మవారి దర్శనం కూడా చేసుకొని, తిరువారంగం బయలుదేరాం.   తిరువారంగంలో  ర...

తిరుమలవాసా…. శ్రీ జగదీశా

ఏమి మా భాగ్యం. మా జన్మ ధన్యం. ఏమి మా ఆనందం. మా మది నందనందనం. స్వామిని ఇంత దగ్గరగా ఈ జన్మలో చూస్తానని ఊహించలేదు . గర్భగుడి దాకా వెళ్ళాకా, కళ్ళారా నిలువెత్తు విగ్రహాన్ని చూ...

మదురై - రామేశ్వరం

Image
ఏమి నా భాగ్యం.. గత ఏడాదినుంచి ఎన్నోసార్లు వెళ్లాలని ప్రణాళికలు కూడా వేసుకున్నా, కుదరక వెళ్లలేకపోయిన అద్భుత ఆలయమాలల  సందర్శనాభాగ్యం ఎట్టకేలకు దొరికింది.  ఎన్ని క్షేత్రాలు, ఎన్ని అద్భుత దర్శనాలు, ఎంత ఆనందం, ఏమి పారవశ్యం !!!   మదురై  మరియు  రామేశ్వరం  - రెండు ప్రదేశాలలో శివయ్య రెండు చేతులతో హత్తుకొని లోనికి రమ్మని పిలిచినట్టు ఎంత చక్కటి దర్శనాలు !!! తిరుచెంగోడు లో స్వయంభూ గా వెలసిన అర్ధనారీశ్వర స్వామిని దర్శించుకున్నాం.  మార్గశిరమాసంలో ఉదయం 7 వరకూ, మరకతలింగ దర్శనం కూడా ఉంటుంది, అదృష్టవశాత్తూ ఆ దర్శన భాగ్యం కూడా దక్కింది.  ఇదే ఆలయ ప్రాంగణంలో సుబ్రహ్మణ్య స్వామి కూడా స్వయంభూ గా వెలిసాడు.  ఆయనని కూడా చక్కగా దర్శించుకొని ప్రయాణం కొనసాగించాం.  మదురై దగ్గరలో అళగర్ కొండమీద ఉన్న సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనం ఎంతో బాగుంది.  చక్కగా స్వామి ముందు రెండు నిముషాలు కూర్చోనిచ్చి పంపించారు.  ఇది 6 సుబ్రహ్మణ్య క్షేత్రాలలో ఒకటి.   దర్శనం చేసుకొని వచ్చేసరికి కొండ దిగువన ఉన్న పెరుమాళ్ ఆలయం తెరిచిల...

అయ్యప్ప దర్శనం

Image
 ఎన్నాళ్లకెన్నాళ్లకు ఈ వైభోగం !!!  ఎలా అయితేనేం, అయ్యప్ప స్వామి కొండకి వెళ్లి వచ్చాను.  స్వామిని కళ్లారా దర్శించుకోగలిగాను.  విపరీతమైన రద్దీలో కూడా ప్రశాంతమైన దర్శనం ప్రసాదించాడు, ఆ హరిహర పుత్రుడు.  ఇన్ని రోజులకు దొరికిన అదృష్టం కొద్దీ, శబరిమల ఎక్కుతూ శరణుఘోష వినగలిగాను.  అంత పెద్ద కొండపై, ఇంకా పెద్ద గుడిలో, చిన్ని విగ్రహం ఇంకా కళ్ళ ముందే ఉంది సుమా.  ఇంతమంది స్వామిమాల ఎందుకు వేసుకుంటారు, ఇంత కఠినమైన నియమాలని ఎలా పాటిస్తారు, నఖ-శిఖ పర్యంతం పవిత్రతని ఎలా కాపాడుకుంటారు, మనసుకి మలినాలు అంటకుండా ఎలా మండలదీక్ష చేస్తారు - ఇలా ఎన్నో ప్రశ్నలు నా మనసులో ఎప్పటినుంచో రగులుతున్నవే.  అదేమిటో విచిత్రం, అన్నిటికీ సమాధానం మాత్రం, అయ్యప్పని దర్శనంతో దొరికినట్టే అనిపించింది.  స్వామిని తన్మయత్వంతో ఆపాదమస్తకం కళ్ళతో జుర్రేస్తూ ఉంటే, ఎవరో భక్తుడు విసిరిన మొక్కుబడి మూట, నా ముక్కుకి తగిలి వాచింది.  "ఇన్నాళ్లు రాకుండా ఆలస్యం చేసావేం రా" అని స్వామి ముద్దుగా మందలించాడేమో. ఉదయాన్నే,  చంగనూరు లో రైలు దిగి, పంబ వరకూ బస్సులో వెళ్లాం.  అక్కడ ...

నివేదనలు - ప్రసాదములు

నివేదనలు 1) చూతఫలం= మామిడిపండు  2) ఖర్జూర= ఖర్జూరం.             3) నింబ= వేప 4) నారింగ= నారింజ 5) భల్లాతకీ= జీడిపప్పు 6) బదరీ= రేగు 7) అమలక= ఉసిరికాయ 8) శుష్కద్రాక్ష= కిస్మిస్ 9) అమృత లేక బీజాపూరం=  జామపండు 10) ఇక్షుఖండం= చెఱకుముక్క 11) కదళీఫలం, రంభా ఫలం= అరటిపండు 12) నారికేళం= కొబ్బరికాయ 13) జంభీర= నిమ్మ పండు 14) దాడిమీ= దానిమ్మపండు 15) సీతాఫలం= సీతాఫలం 16) రామఫలం= రామఫలము 17) కపిత్త= వెలగ పండు 18) శ్రీ ఫలం, బిల్వఫలం= మారేడు 19) మాదీ ఫలం= మారేడు పండ్లు 20) జంభూఫలం= నేరేడు 21) వాతాదం= బాదము పప్పు ప్రసాదములు 1) కుశలాన్నం = పులగం 2) చిత్రాన్నం= పులిహోర 3) క్షీరాన్నం= పరమాన్నం 4) పాయసం= పాయసం 5) శర్కరాన్నం= చక్కెరపొంగలి 6) మరీచ్యన్నమ్= కట్టు లేదా మిరియాల పొంగలి 7) దధ్యోదనం= పెరుగు అన్నము 8) తిలాన్నం= నువ్వులపొడితో చేసిన అన్నం 9) శాకమిశ్రితాన్నం= కిచిడీ 10) గుడాన్నం = బెల్లపు పరమాన్నం 11) సపాదభక్ష్యం= గోధుమనూకతో చేసిన ప్రసాదం  (గోధుమ నూక పంచదార నెయ్యి సమపాళ్ళలో వేసి చేసింది గాన ఆపేరు) 12) గుడమిశ్రిత ముద్గ సూపమ్= వడపప్పు 13) ...

యమదూత వర్తమానం

శ్మశానానికి వెళ్ళి  కాలుతున్న శవాలను అడిగా.. ఎక్కడకి వెళుతున్నారు మీరు అని?? ఏమో తెలీదు అయినా నువ్వెవరు ప్రాణాలతో శ్మశానానికి ఎందుకొచ్చావ్ ,ఎలా వచ్చావ్,ఇంత అర్థరాత్రి, అని అడిగింది కాలుతున్న ఓ శవం.. నేను కొన్ని రోజులనుండి  మానసిక సంఘర్షణకు లోనౌతున్నా మనం ఎవరం ,ఎందుకు పుడుతున్నాం ఎందుకు చచ్చిపోతున్నాం మనవెంట ఏం వస్తుంది?,... అని మాట పూర్తవకుండానే నా మాటకి అడ్డొచ్చింది ఆ శవం, పిచ్చివాడా అవి అందరికీ వచ్చే,ప్రశ్నలే,ప్రతీ హృదయంలో  జరిగే సంఘర్షణే..ఆ మాటకొస్తే నామటుకునాకు చాలాసార్లు వచ్చింది.కాని ఎవరికైనా తెలిస్తే నవ్వుతారేమో అని ఎవరికి చెప్పకుండా ఇక్కడే ఉంటాం ఇదంతా మనదే అని,అణా కూడా దానం చేయకుండా, చాలా ధనం కూడబెట్టా,కొంత భూములు తవ్వికూడా దాచుకున్నా వాటిని తగ్గలెయ్యా నేను తగలబడిపోతున్నా రావట్లేదే???ఇందాకణ్ణించీ అదే ఆలోచిస్తున్నా.. సరే నువ్వేం చేసావో చెప్పు.. మళ్ళీ నేను చెప్పడం ఆరంభించా.. అలా మానసిక సంఘర్షణతో ఉండలేక అందర్ని అడగడం మొదలెట్టా ఎవ్వరూ చెప్పలేదు సరికదా కొంతమంది తిట్టారు,కొంతమంది కొట్టడానికొచ్చారు,కొంతమంది పిచ్చోడన్నారు..కొంతమందైతే సంపాదించడం చేతకాకే ఇలాంటివి ఆల...

కనకధారా స్తోత్రం - అర్థం

Image
శ్లో॥ అంగం హరే: పులక భూషణ మాశ్రయంతీ భృంగాంగనేవ ముకుళాభరణం తమాలమ్ । అంగీకృతాఖిల విభూతి రపాంగలీలా మాంగల్యదా౭స్తు మమ మంగళదేవతాయా: ॥2 తాత్పర్యము : ఆఁడు తుమ్మెద నల్లని తమాల వృక్షముపై వాలినట్లుగా ఏ మంగళదేవత యొక్క ఓరచూపు నీలమేఘశ్యాముఁడైన భగవాన్ విష్ణుమూర్తిపై ప్రసరించినప్పుడు ఆ వృక్షము తొడిగిన మొగ్గలవలె ఆయన శరీరముపై పులకాంకురములు పొడమినవో, అష్టసిద్ధులను వశీకరించుకొన్న ఆ శ్రీ మహాలక్ష్మీ భగవతి యొక్క కృపా కటాక్షము నాకు సమస్త సన్మంగళములను సంతరించును గాక ! శ్లో॥ ముగ్ధా ముహుర్ విదధతీ వదనే మురారే: ప్రేమ ప్రపాత ప్రణిహితాని గతాగతాని । మాలా దృశోర్ మధుకరీవ మహోత్పలే యా సా మే శ్రియం దిశతు సాగర సంభవాయా: ॥3 తాత్పర్యము : ఒక పెద్ద కమలము చుట్టుత ఆగి-ఆగి పరిభ్రమించు తుమ్మెద వలె విష్ణుమూర్తి యొక్క మోముపై వెల్లువలెత్తిన ప్రేమను మాటిమాటికిని ప్రసరింపజేయు శ్రీ మహాలక్ష్మీదేవి కటాక్ష పరంపర నాకు సంపదల ననుగ్రహించు గాక ! శ్లో॥ విశ్వామరేంద్ర పద విభ్రమ దాన దక్షమ్ ఆనంద కంద మనిమేష మనంగ తంత్రమ్ । ఆకేకర స్థిర కనీనిక పద్మనేత్రమ్ భూత్యై భవేన్మమ భుజంగ శయాంగనాయా: ॥4 తాత్పర్యము : తనను భజించువారికి దేవేంద్ర పదవిని సైతమివ్వజ...