Posts

Showing posts from 2018

లయం

జన్మించిన ప్రాణి మరణించక తప్పదు. మరణించిన తర్వాత జన్మించక తప్పదు’ ఇది ప్రకృతి ధర్మం. ఈ ధర్మానికి ప్రధాన రక్షకులు ముగ్గురు. వారే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. వీరు ముగ్గురు సర్వ స్వతంత్రులు అయినప్పటికీ.., ఒకరి విధి నిర్వహణలో మరొకరు తల దూర్చరు.  ‘బ్రహ్మ’...సృష్టి ధర్మానికి రక్షకుడు. ప్రాణికోటిని సృష్టించడమే ఈయన ధర్మం.  ‘విష్ణువు’...సృష్టిని పోషించి, రక్షించడమే ఈయన ధర్మం. ఈ ధర్మరక్షణ కాస్త కష్టంతో కూడుకున్న వ్యవహారం. ఒక కుటుంబాన్ని పోషించి, రక్షించడానికి.., యజమాని అబద్ధాలు ఆడాల్సి  వస్తుంది., మోసాలు చేయాల్సి వస్తుంది. కేవలం ఒక్క కుటుంబ రక్షణే ఇంత కష్టతరం అయినప్పుడు.., మరి ఈ మాయాజగత్తును పోషించి, రక్షించడమంటే మాటలా! ఈ ధర్మరక్షణ కోసమే ‘శ్రీ మహావిష్ణువు’ ఎన్నో అవతారాలు ఎత్తాడు..,ఎన్నో మాయలు పన్నాడు.., మరెన్నో మోసాలు చేసాడు. ఎలా రక్షించాడు అన్నది అప్రస్తుతం. ఇక్కడ రక్షణే ప్రధానాంశం.  ‘మహేశ్వరుడు’...లయకారకత్వం ఈయన ధర్మం. ‘లయం’ అంటే ‘ నాశనం’ అని ఓ తప్పుడు అర్ధాన్ని చెప్పేస్తారు. ఇంగ్లీషు భాషలో ‘destroyer’ అనే పదాన్ని వాడతారు. అది తప్పు. ‘absorber’ అనే పదాన్ని వాడాలి. ...

శృంగేరి-ఉడుపి

Image
బెంగుళూరు వచ్చిననుంచీ, ఎన్నో అందమైన ఆలయాలు, అద్భుతమైన దర్శనాలు దొరుకుతున్నాయి, ఈసారి ఇంకొక అడుగు ముందుకు వేసి, 1000 కిమీ దాటి కారులో పెద్ద ప్రయాణమే చేసి వచ్చాం.  క్రిస్మస్ సెలవులని బాగా ఉపయోగించుకున్నాం. శనివారం సాయంత్రం ఇంటి నుంచి బయలుదేరి,  సకలేష్ పుర చేరుకున్నాం.  సకలేశ్వర స్వామిని దర్శించుకొని, ఆ ఊళ్ళోనే రాత్రికి బస చేసాం.  2000 సంవత్సరములనాటి ఆ ఆలయానికి మళ్ళీ ఉదయాన్నే ఇంకొకసారి వెళ్లి, స్వామిని చూసుకొని కుక్షి సుబ్రహ్మణ్యం చేరుకున్నాం.  ఆది సుబ్రహ్మణ్య స్వామి, కుక్షి సుబ్రహ్మణ్యస్వామి దర్శనాలు చక్కగా అయ్యాయి.  అక్కడనుంచి ధర్మస్థల కి మా ప్రయాణం.  మంజునాథస్వామి దర్శనానికి, పుంఖానుపుంఖాలుగా జన సందోహం వచ్చేసింది.   Special దర్శనం టిక్కెట్లు కొనుక్కొని, 4 గంటలు పైగా క్యూలో వేచి, చివరకు స్వామిని చూడగలిగాం.  అమ్మవారిని కూడా దర్శించుకొని, దేవస్థానంవారు పెట్టిన భోజనం చేసి, 8PM కి హొరనాడు చేరుకున్నాం.  అన్నపూర్ణేశ్వరి దేవి దర్శనం చక్కగా అయింది.  రాత్రి అక్కడే బస. తెల్లారి లేస్తూనే, శృంగగిరి (శృంగేరి) కి బయలు...

సుందరకాండ పారాయణం

Image
చూసి రమ్మంటే కాల్చి వచ్చినవాడికి ఆ ధైర్యమెక్కడిది? సుందరకాండ ఒక అద్భుతమైన మానసిక విశ్లేషణా శాస్త్రం. ఎటువంటి కష్టాల్లో ఉన్న ఒక్కసారి పారాయణం చేస్తే దన్నుగా ఉండి ఆ పరిస్థితిని చక్కబరుస్తాడు మన భవిష్యద్ బ్రహ్మ. ఎవరికైనా ఒక సంఘటన జరిగింది అంటే దానికి ఎన్నో కారణాలు కలిసి ఆ స్థితిని కలుగచేస్తాయి. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ సంఘంలో మనం అందరమూ కర్మవశాత్తు అందరం ఒకళ్ళకు ఒకళ్ళు సంబంధం ఉన్నవారమే. మనం కేవలం మాటలు, చేతలతో మాత్రమే కాక ఆలోచనల ద్వారా ఒకరిని మరొకరు ప్రభావితం చెయ్యగలవాళ్లము, భావాలు వ్యక్తం చేసుకోగలిగే వాళ్లము. ఇది కొంచెం తాత్త్విక దృష్టి ఉన్నవాళ్ళకు నిత్య అనుభవైకవేద్యం. ఎన్నో సమస్యలకు మనకే సరైన ఆలోచన ప్రచోదనం అవ్వడం వలన పరిష్కారం దొరుకుతుంది. దాన్నే మనం సరస్వతీ కటాక్షం అని కూడా అంటూ ఉంటాము. ఒకొక్కసారి మనకు తెలియని శక్తి ఆ సమస్యకు కారణమైన వారి మనస్సును ప్రభావితం చేసి ఆ సమస్యను సరళం చేస్తూ ఉంటుంది. వీటికి అద్భుతంగా దోహదం చేసే అమూల్య సాధనం సుందరకాండ పారాయణ అని మనకు దైవజ్ఞులు, పెద్దలు చెప్పి ఉన్నదే, కొత్తగా మనం కనిపెట్టింది కాదు. ఎంతో దైన్యావస్థలో ఉన్నా కూడా సుందరకాండ చదవడం ద...

భీమాశంకరం - హరిశ్చంద్రగఢ్

Image
కార్తీకమాసం ఈసారి మరపురాని అనుభూతులని మిగిల్చింది.  వారాంతాలన్నీ శివుని దర్శనాలతో మనోహరంగా మారిపోయాయి.  చివరి వారాంతం మరొకసారి అద్భుతం జరిగింది - మహాదేవుని దివ్య దర్శనంతో మనసు, తనువు పులకించిపోయాయి. పూణే లో స్వామివారి అద్భుత ఆలయాలను దర్శించుకొని, మధ్యాహ్నానికి భీమాశంకరం చేరుకున్నాం.  భీమాశంకరం - గోపుర దర్శనం Places visited: పాతాళేశ్వర్ - పూణే - 30th Nov - 8 AM ఓంకారేశ్వర్ - పూణే - 30th Nov - 8:30 AM శ్రీమంత్ దగుడు సేఠ్ గణపతి - పూణే - 30th Nov - 9 AM  భీమాశంకరం - జ్యోతిర్లింగం - 30th Nov - 3 PM హరిశ్చంద్రేశ్వర్ - హరిశ్చంద్రగఢ్ - 1st Dec - 11AM  కేదారేశ్వర్ - హరిశ్చంద్రగఢ్ - 1st Dec - 11:30 AM  గణపతి - హరిశ్చంద్రగఢ్ - 1st Dec - 12:30 PM  భక్త తుకారాం - వైకుంఠ స్థాన్ - పూణే - 2nd Dec 9:30 AM

రంగనాథ దర్శనం

Image
ఎంత వెతికితే చాలు అనిపిస్తుంది, అంతా నిండిన భగవంతుడిని ?  బెంగళూరు కి ఇంత దగ్గరలో, ఇన్ని క్షేత్రాలలో రంగనాథ స్వామి వెలిశారు అని తెలిసి ఆశ్చర్యం, ఆనందం !!! కార్తీకంలో, ఇంకొక మరపురాని వారాంతం.  కళ్ళ విందుగా, మనసు నిండుగా, దర్శనాలు పొందిన ఈ జన్మ ధన్యం. ఎన్నో స్వయం వ్యక్త క్షేత్రాలు, సాలగ్రామ రూపంతో రంగనాథుడు లక్ష్మీసమేతుడై వేంచేసి ఉన్న మహాద్భుత ప్రదేశాలు !!! మాండవ్య మహా ముని, వసిష్ఠుడు వంటి ఎందరో మహానుభావులు కొలిచిన మూర్తులు మనం చూడగలగడం, ఎంతటి అదృష్టమో కదా !!!  ఇంతకన్నా ఇంకేమి కావాలి, నిన్ను ఇంకేమి అడగాలి !!! అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం దేహాంతే తవ సాయుజ్యం దేహిమే పార్వతీపతే !!! Places visited: 25th Nov Sri Ranganatha Swamy Temple, Magadi  - 8AM Sri Someshwara Temple, Aladakattepalya  - 10AM Lakshmi Narasimha Temple - Devarahatti - 11AM Sri Ranganathaswamy Temple, Doddamudigere  - 12 noon Sri Guddada Ranganatha Swamy Temple, A. Hosahalli  - 1 PM Sri Shaneshchara Punyakshetra, Dombarahatti  - 2 PM Bettada Ranganathaswamy T...

పంచారామాలు - అష్టసోమేశ్వరాలు

Image
మా అమ్మ-నాన్న చాలా ఏళ్లుగా చూసిన ఎదురుచూపులు, ఈ ఏడాది ఫలించాయి.  పంచారామాలు ఒకే రోజు చూడాలన్న వాళ్ళ కోరిక ఆ భగవంతుడు ఇన్నాళ్లకు తీర్చాడు. ఉదయాన్నే గుంటూరు నుంచి అమరావతి చేరుకున్న మాకు, మైకు లో "అభిషేకం మొదలవుతోంది, అభిషేక దర్శనం చూడాలనుకునే భక్తులు తొందరగా రండి" అంటూ వినబడింది.  అమరేశ్వర స్వామికి (ఇంద్ర ప్రతిష్ఠితం) నమక చమకాలతో అభిషేకం చేస్తూ ఉంటే, గుడ్లప్పగించి అలా చూస్తూ ఉండిపోయాం.  ఎంత బాగుందో, కళ్ళకి ఎంత సంబరమో. అమరావతి ఉంచి భీమవరం చేరుకున్న మాకు, సోమేశ్వర స్వామి (చంద్ర ప్రతిష్ఠితం) చక్కటి దర్శనం ఇచ్చారు.  ఎందుకో తెలియదుగానీ, ఎక్కువ భక్తులు లేరు.  మాకు స్వామి సన్నిధి లో ఎక్కువసేపు ఉండే అవకాశం దక్కింది.  అక్కడినుంచి పాలకొల్లు వెళ్లాం, క్షీరా రామలింగేశ్వర స్వామిని (విష్ణు ప్రతిష్ఠితం) చక్కగా దర్శించుకున్నాం. కొప్పు రామలింగేశ్వరుని కొప్పు చక్కగా కనబడింది సుమా.  తరువాత మజిలీ, సామర్లకోట.  చాళుక్య కుమారా రామ భీమేశ్వర స్వామిని (కుమారస్వామి ప్రతిష్ఠితం) చూసి తరించాం.  చివరగా దక్షారామం వెళ్లిన మాకు భీమేశ్వర స్వామి...

పంచభూత శివాలయాలు

Image
కార్తీకం మొదలవుతూనే శివయ్యని దర్శించుకోవాలని కొన్ని నెలలుగా వేచి ఉన్నాం.  దీపావళి అవుతూనే, అర్ధరాత్రి లేచి రైలు ఎక్కేసాం.  తిరుచిరాపల్లి లో దిగి, జంబుకేశ్వర స్వామి (జల లింగం) దర్శనం చేసుకొని  పంచ భూత శివాలయాల యాత్రకు ఆరంభం చేసాం. అక్కడినుంచి శ్రీరంగంలో రంగనాథ స్వామి విరాట్ రూపాన్ని కళ్లారా దర్శించి, సాయంత్రం పుండరీకాక్షుని సన్నిధికి వెళ్లాం. అద్భుతమైన ఆలయాన్ని, అయ్యవారి అందాన్ని చూస్తూ పరవశించిపోయాం.  రాత్రి మళ్ళీ జంబుకేశ్వర స్వామి సన్నిధిలో గడిపి, శ్రీరంగంలోనే బస చేసాం. తెల్లారి లేస్తూనే, చిదంబరానికి బయలుదేరాం.  త్రోవలో వైద్యనాధేశ్వరుని దర్శించుకొని, నటరాజ సన్నిధికి (ఆకాశ లింగం) చేరుకున్నాం.  అక్కడే చాలాసేపు అయ్యోరిని, అమ్మోరిని చూస్తూ గడిపేసాం.  అక్కడ పార్వతీదేవి పేరు ఏంటో తెలుసా, శివకామసుందరి - ఎంత అందమైన పేరు !!! ఈ ఆలయ ప్రాంగణంలోనే ఒక దివ్యదేశం కూడా ఉంది.  విష్ణుమూర్తి కూడా చక్కని దర్శనం ప్రసాదించారు. సాయంత్రానికి అరుణాచలం చేరుకున్నాం.  అరుణాచలేశ్వరుని (అగ్ని లింగం) దర్శనం పూర్వజన్మ పుణ్య ఫలం.  మానవ జీవితం "అరుణాచల దర్శనాని...

గొరవనహళ్ళి లక్ష్మీదేవి

Image
భక్తి టీవీ లో పుణ్యక్షేత్రం కార్యక్రమంలో చూసిన ఒక గొప్ప క్షేత్రం, గొరవనహళ్ళి లక్ష్మీదేవి ఆలయం.  చూసినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు వెళ్తామా అని అనుకుంటూనే ఉన్నాం.  ఇన్నాళ్టికి మాకు ఆ అవకాశం దొరికింది. ఉదయాన్నే ఇంటి నుంచి బయలుదేరి, ముందుగా ముక్తినాథేశ్వర స్వామి దగ్గరకి చేరుకున్నాం.  సరిగ్గా, స్వామికి నమక చమకాలతో అభిషేకం చేస్తూ ఉండగా వెళ్లి, కళ్లారా ఆ తంతు అంతా పరికించి ఆనందించాం.  పురాతన ఆలయం, కొత్త సొబగులతో అందంగా ఉంది.  స్వామి ఇంకా మమ్మల్ని చూస్తున్నట్టే ఉంది.  అక్కడ నుంచి బయలుదేరి, పక్కనే ఉన్న విఠల ఆలయం లో కూడా అభిషేకం చూసాం.  త్రోవలో ఉన్న రామ మందిరం చూసి, అక్కడ నుంచి భోగ నరసింహ స్వామి క్షేత్రానికి చేరుకున్నాం.  స్వామి వైభవం అంతా ఇంతా కాదు, వర్ణించనలవి కాదు.  ఆ తరువాత కొండ మీద వెలసిన యోగ నరసింహ స్వామి క్షేత్రానికి వెళ్లాం.  600 మెట్లు ఎక్కి అందమైన ప్రకృతిలో అందంగా అలరారుతున్న అయ్యవారిని, దేవేరిని చూసి మురిసిపోయాం. అక్కడినుంచి సరాసరి లచ్చమ్మ దగ్గరకి ప్రయాణం.  అమ్మవారు స్వయంగా విలసిన ఈ క్షేత్ర వైభవం అనన్య సామాన్యం....

కదిరి - లేపాక్షి

Image
బెంగుళూరు నుంచి దగ్గరలో ఉన్న అద్భుత క్షేత్రాలలో ఒకటైన "శ్రీమత్ ఖాద్రి నరసింహ స్వామి" దగ్గరకి ఇన్నాళ్లకు పిలుపు వచ్చింది.   గూగుల్ సహాయంతో - త్రోవలో ఉన్న ఇంకొన్ని క్షేత్రాల దర్శనాలు చేసుకుంటూ రెండు రోజులని ఆనందంగా గడిపేసాం. ఎంతో విలువైన జ్ఞాపకాలతో తిరిగివచ్చాం. అసలు ఆరంభమే అద్భుతం - వేణుగోపాల స్వామికి జరిగిన అభిషేకాలు, సేవలు - కనుల విందుగా చూసాం.  నంది హిల్స్ పైన ఉన్న యోగ నందీశ్వర స్వామి ఆలయం చాలా బాగుంది.  రమణీయమైన ప్రకృతిని చాలాసేపు  ఆస్వాదించి, కొండదిగి భోగ నందీశ్వరాలయానికి చేరుకున్నాం.  మాటలకందని అనుభూతితో అక్కడ నుంచి  రంగనాథ స్వామిని చూడటానికి వెళ్లాం.  తలుపులు వేసి ఉన్నాయని అనుకుంటూ ఉండగానే, "వెళ్లి, తలుపులు తీసుకొని దర్శనం చేసుకోండి" అన్న మాటలు వినబడ్డాయి.  ఇంకేం కావాలి ?  మనసు పరవశంతో పరవళ్లు తొక్కింది. చక్కగా స్వామి సన్నిధి లో కాసేపు గడిపి వచ్చాం.  తరువాత జాలరి నరసింహ స్వామి, స్వయం వ్యక్తమై వేంచేసిన క్షేత్రాన్ని దర్శించి  కదిరి చేరుకున్నాం.  శ్రీమత్ ఖాద్రి నారసింహ స్వామి వారి దర్శనం...

దసరా నవరాత్రులు

యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః  ప్రతి ప్రాణిలోనూ ఆ జగన్మాత ఇచ్ఛాశక్తిగా, భౌతిక శక్తిగా, జ్ఞానశక్తిగా, క్రియాశక్తిగా లోపల దాగి ఉంటుంది. ఆ కారణంగానే ప్రతిప్రాణీ తన బుద్ధితో ఓ పనిని చేయాలని సంకల్పించి, దానికి తన భౌతిక శక్తిని వినియోగించి, జ్ఞానశక్తిగా మార్చుకుంటుంది. ఆ జ్ఞానశక్తినే క్రియాశక్తి రూపంలో ఆచరించగలుగుతున్నది. సృష్టిలోని సకలచరాచరాల్లో శక్తి రూపంలో దాగి ఉన్న ఆ తల్లికి వేలవేల నమస్కారాలు. సృష్టిలోని సకల జీవులు ఆ అమ్మనే ఆశ్రయిస్తాయి. కనుకనే ఆమె అమ్మలగన్న అమ్మ అయింది. శ్రీదేవి లీలా విగ్రహ స్వరూప మహాత్మ్యం అనిర్వచనీయం. వర్ణించడం ఎవరి తరమూ కాదు. ఆదిపరాశక్తి.. అమ్మలగన్న అమ్మ.. శరణన్న వారిని రక్షించి అభయమిచ్చే లోకపావని ఆ జగన్మాత. లోకకల్యాణార్థం రాక్షస సంహారం గావించింది. ఒక్కొక్క రోజు ఒక్కో రూపం ధరించి తొమ్మిది రోజుల పాటు తొమ్మిది మంది రాక్షసు లను సంహరించింది. ఆమె సాధించిన విజయా నికి గుర్తుగా తొమ్మిది రోజులపాటు నవరాత్రుల ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నాం. శర దృతువులో వస్తాయి కాబట్టి వీటిని శరన్నవ రాత్రులు అంటారు. ఈ దేవీ నవరాత్రులు అమ్మ వ...

మహాదేవా !!!

మహాదేవా అభిషేకానికి నీళ్ళు తీసుకుని గుడిమెట్లు ఎక్కాను. కానీ.. పవిత్ర గంగ నిన్ను ప్రతిక్షణం అభిషేకిస్తుంది కదా !!! మహాదేవా! హలాహలం వేడితో నువ్వు తపిస్తున్నావని, మంచి గంధలేపనం వేద్దాం అనుకున్నాను. కానీ... చల్లదనంకి ప్రతిరూపమైన హిమశిఖరమే, నీ వాసం, నీ శిరసే శశాంకుడి నివాసం. మహాదేవా! మణిమాణిక్యాలతో నిన్ను పూజిద్దాం అనుకున్నాను. అన్నట్టు, మణిరాజు అయిన వాసుకి, నీ మెడలో కంఠాభరణం కదా మహాదేవా! వేద స్తోత్రాలతో నిన్ను స్తుతిద్దామని అనుకున్నాను. వేదాలనే చెప్పిన ఆదిగురువు దక్షిణామూర్తివి నీవేగా . మహాదేవా! కమ్మని సంగీతంతో నిన్ను పరవశింపచేద్దాం అని అనుకున్నాను. తరచి చూస్తే, సంగీతానికి బీజమైన ఓంకారాం, నీ ఢమరుకనాదమే !!! మహాదేవా! శాస్త్రీయనాట్యంతో నిన్ను అలరిద్దాం అనుకున్నాను.  నాట్యానికే ఆచార్యుడివైన నటరాజు నువ్వేగా . మహాదేవా! షడ్రుచులతో నీకు నైవేద్యం పెట్టి మురిసిపోద్దాం అనుకున్నాను. అయితే, అందరికి ఆహారాన్ని ఇచ్చే అన్నపూర్ణయే, నీ అర్ధశరీరం మహాదేవా! ఉపచారాలతో నీకు సేవ చేసే భాగ్యం పొందుదాం అనుకున్నాను. ఆ పనికోసమే పుట్టిన  శిలాదుడి పుత్రుడైన, బసవ నందీశ్వరుడు నీ వద్దే ...

చాముండీ దేవి - పంచలింగ క్షేత్రాలు

Image
బెంగళూరు వచ్చినప్పటి నుంచి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన తరుణం - మైసూరు వెళ్లి చాముండీ శక్తి పీఠం చూసి వచ్చాము.  అనిర్వచనీయమైన ఆనందం -  అదృష్టం కొద్దీ ఎక్కువ జనం లేకపోవడంతో చాలా సేపు అమ్మవారిని చూస్తూ ఉండిపోయాం.  పక్కనే స్వయంభూ గా వెలసిన మహాబలేశ్వర స్వామిని చూసి పొంగిపోయాం.  అక్కడి నుంచి తలకాడు అనే గ్రామానికి మా ప్రయాణం.  మార్గమధ్యంలో, కావేరీ తీరంలో వెలసిన శ్రీ మహాలక్ష్మీ సమేత గుంజా నరసింహస్వామిని కళ్లారా దర్శించి, తలకాడు చేరుకున్నాం.  పంచలింగ క్షేత్రాలు అయిన  వైద్యనాథేశ్వర స్వామి, పాతాళేశ్వర స్వామి, మరాళీశ్వర స్వామి దర్శనాలు అద్భుతం.   కీర్తి నారాయణ దేవాలయంలో, విష్ణుమూర్తి ప్రసన్నంగా దర్శనం ఇచ్చారు.  తిరుగు ప్రయాణం శ్రీరంగపట్టణానికి.  మార్గమధ్యంలో సోమేశ్వరపుర లో, కేశవ స్వామి ఆలయం అలనాటి శిల్పకళకు, దైవభక్తికి, శాస్త్ర నైపుణ్యానికి ఒక నిదర్శనం.  ఆ మహాద్భుతాన్ని చూసాకా, శ్రీరంగపట్టణ చేరుకున్నాం.  అక్కడ, చాముండీదేవి కి చెల్లెలు అయిన నిమిషాoబ అమ్మవారిని చూసాము.  శ్రీ చక్రంతో వెలసిన ఈ అమ్మవారు ...

శతగాయత్రి

బ్రహ్మ గాయత్రి :- 1. వేదాత్మనాయ విద్మహే హిరణ్య గర్భాయ ధీమహి తన్నో బ్రహ్మః ప్రచోదయాత్.// 2. తత్పురుషాయ విద్మహే చతుర్ముఖాయ ధీమహి తన్నో బ్రహ్మః ప్రచోదయాత్.// 3. సురారాధ్యాయ విద...

భగవద్గీత 18 అధ్యాయాల వీడియోలు

_1వ అధ్యాయము – 1st Chapter_ https://youtu.be/R8Z69FtjX_U _2వ అధ్యాయము – 2nd Chapter_ https://youtu.be/zi-FPqF3rFQ _3వ అధ్యాయము – 3rd Chapter_ https://youtu.be/M_URKV_1vyM _4వ అధ్యాయము – 4th Chapter_ https://youtu.be/0nmyvkL7Udc _5వ అధ్యాయము – 5th Chapter_ https://youtu.be/oHv6Wp3ZuWc _6వ అధ్యాయము – 6th Chapter_ https://youtu.be/kxmSL-WIQKo _7వ అధ్యాయము – 7th Chapter_ https://youtu.be/EhQVNBlb_zs _8వ అధ్యాయము – 8th Chapter_ ...